The Challenge: సాధారణంగా సినిమా షూటింగ్ అంటే.. అడవుల్లో, సముద్రాల్లోకి వెళ్లి షూటింగ్స్ చేయడం చూస్తుంటాం.. అది వీలు కాకపోతే.. ప్రత్యేకంగా సెట్స్ డిజైన్ చేయడమో లేదా గ్రాఫిక్స్ ఉపయోగించి షూట్ చేయడమో చేస్తుంటాడు. కానీ రష్యాకు చెందిన ఓ చిత్ర బృందం..ఏకంగా అంతరిక్షంలో షూటింగ్ చేయాలని నిర్ణయించింది.
అనుకున్నదే తడువుగా.. షూటింగ్ కోసం ఆ సినిమా డైరెక్టర్, హీరోయిన్ ప్రత్యేక వ్యోమనౌకలో మంగళవారం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఐస్)కు బయల్దేరి వెళ్లారు. ‘ది ఛాలెంజ్’ అనే సినిమా షూటింగ్ భాగంగా రష్యా స్పెస్ సెంటర్ రోస్కోస్మోస్‌కు చెందిన సోయుజ్ ఎంఎస్19 వ్యోమనౌకలో ఆ చిత్ర దర్శకుడు క్లిమ్ షిపెంకో, హీరోయిన్ యులియా పెరెసిల్డ్ అంతరిక్షానికి బయల్దేరారు.
ఈ సినిమా షూటింగ్ దాదాపు 12 రోజుల పాటు అంతరిక్ష కేంద్రంలోనే జరుగుతుంది. ఈ స్పేస్ సెంటర్ లోనే సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.స్పేస్‌లో ఉన్న వ్యోమగామిని కాపాడేందుకు భూమి నుంచి ఓ డాక్టర్ ఐఎస్‌ఎస్‌కు వెళ్లే సన్నివేశాన్ని ఇక్కడ చిత్రీకరించనున్నారు. అందులో డాక్టర్ పాత్రలో హీరోయిన్ యులియా నటించనుంది.
సినిమాలో ఈ సీన్ దాదాపు 35 నుంచి 40 నిమిషాలు ఉంటుందట.స్పేస్‌లో షూటింగ్ చేయడం కోసం.. చిత్ర యూనిట్ శిక్షణ కూడా తీసుకున్నారు.‘ది ఛాలెంజ్’ బృందం ఈ నెల 17న తిరిగి భూమికి చేరుకోనుంది. ఈ ప్రయోగంతో సినీరంగంలో నూతన శకానికి నాంది పలికారు రష్యా చిత్ర యూనిట్. అంతరిక్షంలో సినిమా తీసిన తొలి దేశంగా రష్యా నిలవనుంది.