టాలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్ సాయిపల్లవి నటించిన తాజా చిత్రం ‘విరాట పర్వం’ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్నది. శుక్రవారం విడుదలైన ఈ సినిమా ఘన విజయం సాధించడమే కాదు..ఇప్పటి వరకు ఉన్న రికార్డులన్నిటినీ తిరగ రాస్తుందని చూసిన ప్రేక్షకులు చెప్తున్నారు.
ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో సాయిపల్లవి చాలా యాక్టివ్ గా పాల్గొంటున్నది. తాజాగా ఏపీలోని విశాఖపట్నం విజ్ఞాన్ ఇంజినీరింగ్ కాలేజ్ కు టీమ్ తో కలిసి వెళ్లింది. అక్కడ విద్యార్థులతో సినిమా విశేషాలు పంచుకుంది.
ఈ క్రమంలోనే తన తొలి చిత్రం ‘ఫిదా’లోని ‘వచ్చిండే మెల్ల మెల్లగ వచ్చిండే’ పాటకు డ్యాన్స్ చేసి అలరించింది. విద్యార్థులంతా కేరింతలతో ఆమెను ఎంకరేజ్ చేసి వీడియో రికార్డు చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది.
The Natural Performer @Sai_Pallavi92 danced to her iconic song "vachinde" at Vignan engineering college, Vizag 💥💥💥
Receiving an ocean of love from the fans and audience ❤️❤️#VirataParvam @RanaDaggubati @venuudugulafilm @SLVCinemasOffl @SureshProdns#VirataParvamOnJune17th pic.twitter.com/ZNoglOlGw3
— Shreyas Media (@shreyasgroup) June 16, 2022