మంచి రోజుల రాకను స్వాగతించాలి..మంచి రోజులు వచ్చే వరకూ ప్రతిరోజూ ప్రతి క్షణం అందుకోసం కృషి చేస్తూ నిరీక్షణ మాత్రం అస్సలు వదులుకోక ఉండాలి. మంచి రోజులు వచ్చాక హాలీవుడ్ ఆఫర్స్ వస్తాయి.. హీరోయిన్లకు! మంచి రోజులు వచ్చాక ఇప్పటి కన్నా బెటర్ ఔట్ పుట్ ఇచ్చేందుకు అవకాశం కూడా ఉంటుంది. అదీ యాక్టింగ్ పరంగా! ఈ విధంగా కెరియర్ లో మంచి అన్నది ముందున్న మాట. కాలం లోగిలి చెంత ఉండి అందాక ఎవరికి వారు విన్నపాలు చేసుకుంటూ వెళ్లాల్సిందే! ఆ పనికి సమంత మినహాయింపు కాదు.
జీవితం ఎలా ఉన్నా ఎటువంటి మలుపులు తీసుకున్నా వాటిని స్వీకరించడం నేర్చుకోవాలి. జీవితం ఎలాంటి పరీక్షలు పెట్టినా తట్టుకునే నేర్పు ఉండాలి. కనుక జీవితం ఒకేలా ఉండదు అన్నది తేలిపోయింది. ఇక మనం చేయాల్సింది ఏంటి? ఎవరికి మనం అండగా ఉండాలి అన్నవి ఎవరికి వారు తెలుసుకోవాలి. సమంత జీవితంలోనూ అనూహ్యం అయిన మార్పులున్నాయి. రానున్నాయి కూడా! వాటిని స్వీకరించేందుకు ఎదుర్కొనేందుకు తాను ఎన్నడూ సిద్ధమేనని సమంత పరోక్షంగా కొన్ని స్పష్టం అయిన సంకేతాలే ఇస్తున్నది.
అందాల నటి సమంత తన ఇన్ స్టాలో ఓ కామెంట్ రాసి ఫొటోను పోస్టు చేసింది. త్వరలో ఓ మంచి జరగనుంది.. గుర్తుంచుకోండి.. అంటూ తన వ్యాఖ్యను జోడించింది. దీంతో ఈ వ్యాఖ్యతో పాటు ఆమె ఫొటో కూడా తెగ వైరల్ అవుతోంది. సమంత గత కొంత కాలంగా అక్కినేని కుటుంబంతో విడిపోయి ఒంటరిగా ఉంటున్న సంగతి తెలిసిందే! ఇటీవల తన విడాకులకు సంబంధించిన పోస్టు ను కూడా సామాజిక మాధ్యమాల్లో తొలగించి మరో ఆసక్తిదాయక పరిణామానికి తెరలేపారు.
అప్పటి నుంచి చై,సామ్ కలుస్తారని అక్కినేని అభిమానులు వేయి కన్నులతో ఎదురుచూస్తున్నారు. కానీ నాగ్ ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ ఊహించని ట్విస్ట్ ఒకటి ఇచ్చారు. సమంతనే విడాకులు కావాలని ప్రపోజ్ చేసిందని చెప్పి మరో సంచలనాత్మక ప్రకటన చేయడంతో అంతా షాక్ కు గురయ్యారు. ఈ నేపథ్యంలో సమంత మాటలు కూడా మళ్లీ మళ్లీ చర్చకు తావిస్తున్నాయి. అంటే సమంత మళ్లీ ఏదయినా కొత్త నిర్ణయం తీసుకోనుందా? లేదా సినిమాలకు సంబంధించి ఏమయినా గుడ్ న్యూస్ చెప్పనుందా? అన్న ఆసక్తి సినీ అభిమానుల్లో నెలకొని ఉంది.
దీనిపై త్వరలోనే ఓ క్లారిటీ వచ్చేందుకు ఛాన్స్ ఉంది. మరోవైపు నాగార్జున ట్విటర్ వేదికగా స్పందించారు. ఉదయం నుంచి మీడియాలో వస్తున్న వార్తలను కొట్టి పారేస్తూ నాగ చైతన్య – సమంత విడాకులకు సంబంధించి తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని క్లారిఫికేషన్ ఇచ్చారు. పుకార్లను నమ్మవద్దని, దయచేసి వాటిని వార్తలుగా మలచవద్దని మీడియా సంస్థలకు ఆయన విన్నవించారు.
The news in social media and electronic media quoting my statement about Samantha & Nagachaitanya is completely false and absolute nonsense!!
I request media friends to please refrain from posting rumours as news. #GiveNewsNotRumours— Nagarjuna Akkineni (@iamnagarjuna) January 27, 2022