Sri Reddy: టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ కపుల్స్ సమంత(samantha), నాగచైతన్య(naga chaitanya). కానీ ప్రస్తుతం ఈ జంట మీద నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. వారిద్దరూ విడిగా ఉంటున్నారనీ, తర్వలో డైవర్స్ తీసుకోబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. కానీ, ఈ వ్యవహారం మీద ఇటు సామ్ గానీ, అటు చైతూ గానీ నోరు విప్పకపోవడంతో అల్మోస్ట్ డైవర్స్ కన్ ఫాం అనుకుంటున్నారు. సమంతకు భరణంగా దాదాపు 300 కోట్లు చెల్లిస్తున్నారంటూ టాక్ వినిపిస్తోంది.సామ్ పరోక్షంగా చేసే పోస్ట్‌లు కూడా కొత్త అనుమానాలు తలెత్తెలా చేస్తున్నాయి.
ఇదిలా ఉంటే, టాలీవుడ్లో వివాదాస్పద క్యారెక్టర్‌గా నిలిచిన శ్రీరెడ్డి సమంతకు తోటి అమ్మాయిలా మంచి సలహాలు ఇచ్చింది. సోషల్ మీడియాలో ట్విట్టర్ వేదికగా.. ఓ వీడియోలో. సంసారంలో సరిగమలు సహజం, సమంతా వదిన.. మీరు, మా అన్నయ్య ఎప్పటికీ కలిసి ఉండాలి” అంటూ ట్విట్టర్లో వీడియోని పోస్ట్ చేసింది.
‘మీ ఇద్దరినీ ఆశీర్వదీస్తున్నాం మేమందరం. మీ ఇద్దరు కలిసి ఉండాలని కోరుకుంటున్నాం. మీ జంట ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. ఏమైనా జరిగి ఉండొచ్చు. కానీ ఎదైనా ఉండనీ, అడ్జస్ట్మెంట్ అనేది
ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇది నా రిక్వెస్ట్ మాత్రమే. అలుమొగలు అన్నాక.. సంసారంలో సరిగమలుంటాయి.
కొట్టుకోవడం,తిట్టుకోవడం, ఈగోలు, యాటిట్యూడ్లు, మిస్ అండర్ స్టాండింగ్స్ ఇలా చాలానే ఉంటాయి. కానీ కొంచెం అడ్జస్ట్ కావాలి. అమ్మాయికి ఓపిక ఉండాలని మన దేశం చెపుతుంది. కొన్ని కొన్ని మార్చుకుంటే సంసారం బాగుంటుందనేది నా ఉద్దేశ్యం.
ఎంత సమంత అని ఇంగ్లీష్, హాలీవుడ్ పేరు పెట్టుకున్నా.. మనం హాలీవుడ్ నటీనటుల్లా చేయలేం. అది మన సంస్కృతి కాదు. మనది ఆ కల్చర్ కాదు. సమంత వదినా సక్కగా సంసారం చేసుకో. ఇదే నా రిక్వెస్ట్.
కొంచెం అడ్జస్ట్ అయితే బాగుంటుందనేది నా ఉద్దేశ్యం. మీ సమస్యలు ఏంటో నాకు తెలుసు.
మీరిద్దరూ బాగుండాలని కోరుకుంటున్నాను.. నాకు పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టకండిరా అయ్యా. నన్ను కూడా ఆశీర్వదించండి.. నాకు కూడా పెళ్లి కావాలని .. అయ్యయ్యో వద్దురా బాబు.. ఈ కొట్లాడుకోవడం నాకు వద్దు’ అంటూ శ్రీరెడ్డి వీడియోలో చెప్పుకొచ్చింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతుంది.