పాపం సమంత.. అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా!

-

samantha: ప్రముఖ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో సమంత నటించిన శకుంతలం చిత్రం అనుకున్న స్థాయిలో అంచనాలు అందుకోలేకపోయినా సంగతి తెలిసిందే. ఏప్రిల్ 14న విడుదలైన ఈ చిత్రం నిరాశను మిగిల్చింది. కాగా ఈ సినిమా పరాజయంతో సమంత భారీ ట్రోలింగ్ను ఎదురుకోవాల్సి వచ్చింది. అయితే సినిమా విడుదల వారం రోజులు పూర్తికాకుండానే లండన్ వెళ్లిపోయిన సమంతను మరో విధంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్.

శాకుంతలం సినిమా విడుదలై వారం రోజులు అవ్వకముందే సమంత లండన్కు వెళ్ళిపోయింది. అయితే సినిమా భారీ పరాజయాన్ని చవిచూడటంతో ఆ లెక్కల్లో నిర్మాతలు దిల్ రాజు, గుణశేఖర్ మునిగిపోగా సమంత మాత్రం భగవద్గీతలో ఉన్న ఒక శ్లోకాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకొని కర్మ ఫలితానికి వదిలేసి లండన్ వెళ్లిపోయింది. అక్కడ తాజాగా ఓ ఫోటోషూట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫోటోలో బ్లాక్ డ్రెస్ లో సమంత మెస్మరైజ్ చేసింది. ఆమె అందానికి నెటిజన్స్ ఫిదా అయ్యారు. ఈ ఫోటోలు చూసిన కొందరు సమంతా కమ్ బ్యాక్.. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్.. స్ట్రాంగ్ ఉమెన్ అంటూ కామెంట్స్ పెడుతుంటే మరికొందరు మాత్రం దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. అయితే అసలు విషయం ఏంటంటే..

 

samantha

ప్రస్తుతం సామ్ హిందీ రీమేక్ లో ప్రధాన పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఒరిజినల్ వెర్షన్ లో ప్రియాంక చోప్రా చేసిన క్యారెక్టర్ ఇది. ఈ ఈవెంట్ కి విచ్చేసిన సామ్ బ్లాక్ అండ్ బ్లాక్ అవుట్ ఫిట్ లో మంచి స్టిల్స్ కూడా ఇచ్చింది. ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ కాదా హైదరాబాద్ లో ఉన్నప్పుడు శకుంతలం ప్రమోషన్స్లో కళ్లద్దాలు పెట్టుకొని ఏడుస్తూ ముక్కు చీదుతూ కనిపించిన సమంత లండన్ వెళ్ళగానే ఏడుపు మొత్తం మాయం అయిపోయింది అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్న అనారోగ్యం అక్కడికి వెళ్ళగానే ఏమైంది.. ప్రమోషన్స్ లో సైతం కళ్లద్దాలు తీయని సమంత అక్కడికి వెళ్ళగానే అవి ఎలా మాయమయ్యాయి కేవలం సినిమా ప్రమోషన్స్ లో సానుభూతి కోసం మాత్రమే ఇక్కడ డల్ గా కనిపించింది అంటూ కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు.

ఏది ఏమైనా సమంత తాను ఎదుర్కొన్న అనారోగ్యం, ఆరోగ్య సమస్యలు, మానసిక సమస్యలు తనకి మాత్రమే తెలుస్తాయి. అవన్నీ చూసే ప్రపంచానికి అవసరం లేదు అన్నట్టు తయారయింది ప్రస్తుత పరిస్థితులు. ఆరోగ్యం బాలేక కనిపిస్తే నటిస్తుందని.. కొంచెం అందంగా కనిపిస్తే అంతా డ్రామా అంటూ ట్రోల్స్ చేయడం చూసిన సమంత ఫ్యాన్స్ మాత్రం పాపం సమంత ఏం చేసినా నెటిజన్ల కామెంట్లకు బలైపోతుంది అంటూ వెనకేసుకొస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version