రాహుల్‌పై బీహార్‌ బీజేపీ చీఫ్‌ కీలక వ్యాఖ్యలు

-

ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌ గాంధీపై బీహార్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సామ్రాట్ చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. “కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఒసామా బిన్ లాడెన్‌ లా గడ్డం పెంచుకొని.. నరేంద్ర మోడీలా ప్రధానమంత్రి కావాలనే కలలు కంటున్నారు” అని సామ్రాట్ చౌదరి వివాదాస్పద కామెంట్స్ చేశారు. గడ్డం పెంచి, దేశంలో తిరిగినంత మాత్రానా ఎవరూ దేశ ప్రధానమంత్రి కాలేరని సామ్రాట్ చౌదరి ఎద్దేవా చేశారు. గత తొమ్మిదేళ్లలో కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలను వివరించడానికి బీహార్ లోని అరారియాలో శనివారం నిర్వహించిన సభలో మాట్లాడారు సామ్రాట్ చౌదరి.

Rahul Gandhi disqualification not in interest of healthy democracy: SAD

“రాహుల్ ను రాజకీయాలలో 50 ఏళ్ల పిల్లాడిగానే మేం పరిగణిస్తున్నాం” అని వ్యాఖ్యానించారు. “విపక్షాలను ఏకం చేస్తానంటూ బీహార్ సీఎం నితీష్ కుమార్ దేశమంతా తిరుగుతున్నారు. కలిసిన ప్రతి ఒక్కరికి తానే దేశానికి ప్రధానమంత్రి అని చెప్పుకుంటున్నారు” అని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కనీసం ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరో నిర్ణయించుకునే స్థితిలో కూడా ప్రతిపక్షాలు లేవని సామ్రాట్ చౌదరి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news