వైసీపీ ప్రభుత్వంపై జేపీ నడ్డా సంచలన వ్యాఖ్యలు

-

ఏపీ బీజేపీ ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తి పట్టణంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఏపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని అన్నారు. రాష్ట్రంలో ల్యాండ్ స్కాం, లిక్కర్ స్కాం జరుగుతోందని జేపీ నడ్డా ఆరోపించారు. ఏపీలో అభివృద్ధి నిలిచిపోయిందని, శాంతిభద్రతలు పూర్తిగా లోపించాయని జేపీ నడ్డా ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఇవాళ రాజధాని లేని రాష్ట్రంగా నిలిచిందని జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. జగన్ ప్రభుత్వం పాలనను గాలికి వదిలేసిందని విమర్శించారు.

Rahul Gandhi permanent part of anti-nationalist toolkit': JP Nadda on  Congress leader's UK remarks | India News,The Indian Express

అనేక ప్రాజెక్టులకు రాష్ట్ర వాటా ఇవ్వడంలేదని నడ్డా ఆరోపించారు. రాష్ట్ర వాటా ఇవ్వకపోవడం వల్ల అభివృద్ధి పనులు నిలిచిపోయాయని జేపీ నడ్డా తెలిపారు. ప్రధాని మోదీ ఎప్పటికీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేయరని, దేశమంతా అభివృద్ధి జరగాలనే విధానం వైపు ఆయన మొగ్గుచూపారని నడ్డా వివరించారు. ఓటు బ్యాంకు రాజకీయాలను మోదీ బాధ్యతాయుత రాజకీయాల వైపు మళ్లించారని పేర్కొన్నారు. ఏపీకి ప్రధాని మోదీ ఏంచేశారో రాష్ట్ర నేతలు వివరించారని నడ్డా వెల్లడించారు జేపీ నడ్డా. మోదీ ప్రధాని అయ్యే నాటికి విద్యుత్ లేని గ్రామాలు 19 వేలు ఉండేవని, ఇప్పుడు దేశంలో విద్యుత్ లేని గ్రామమే కనిపించదని తెలిపారు. ఇవాళ దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా ఫైబర్ కేబుల్ ద్వారా ఇంటర్నెట్ సౌకర్యం అందుతోందని జేపీ నడ్డా వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news