శాంసంగ్ నుంచి కొత్త ఫోన్ లాంచ్ అయింది. అదే గెలాక్సీ ఎస్23 సిరీస్ స్మార్ట్ ఫోన్. కంపెనీ ఈ సిరీస్‌ను ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి లాంచ్ చేసింది. ఈ సిరీస్ కింద మూడు స్మార్ట్‌ఫోన్లు ఇప్పటికే మార్కెట్లోకి వచ్చాయి. ఇందులో అత్యంత ప్రజాదరణ పొందిన ఫోన్ Samsung Galaxy S23 Ultra. శాంసంగ్ తన ఎస్23 అల్ట్రా మోడల్‌లో కొత్త ఎడిషన్‌ను పరిచయం చేసింది. దీనికి Samsung Galaxy S23 Ultra BMW M Edition అని పేరు పెట్టారు. ఫోన్‌కు సంబంధించిన కొన్ని వివరాలు లీక్ అయ్యాయి.. లీకుల ఆధారంగా స్పెసిఫికేషన్స్, ధర ఎలా ఉందంటే..
ధర ఎంత?
Samsung Galaxy S23 Ultra BMW M ఎడిషన్ ఫాంటమ్ బ్లాక్ కలర్‌లో లభిస్తుంది. దీని ధర రూ.1,12,960గా నిర్ణయించినట్లు సమాచారం. ఇది భారతదేశంలోని సాధారణ శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా మోడల్ కంటే కూడా తక్కువ.
దీని ప్యాకేజింగ్ సాధారణ ఎస్23 అల్ట్రా కంటే పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో, మీరు BMW కీ రింగ్, ఆరు విభిన్న BMW లోగోలు, BMW రౌండల్‌ను పొందవచ్చు. కంపెనీ తన 50వ వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి దీనిని పరిచయం చేసిందట. అదనంగా ఎయిర్ కంప్రెసర్, ‘వి ఆర్ ఎమ్’ మెటల్ లోగో, కప్ హోల్డర్/వైర్‌లెస్ ఛార్జర్, గడియారం, ఫోటో బుక్, పోస్టర్ కూడా లభిస్తుంది..
మొబైల్ ఫోన్ స్పెసిఫికేషన్ సాధారణ Samsung Galaxy S23 Ultra మాదిరిగానే ఉండవచ్చు. మీరు BMW M ఎడిషన్‌లో మూడు విభిన్న రకాల బూట్ యానిమేషన్‌లు అందించారు. అంటే స్మార్ట్ ఫోన్ ఓపెన్ చేయగానే ఈ ఎడిషన్‌లో విభిన్నమైన యానిమేషన్ కనిపిస్తుంది. ఈ బీఎండబ్ల్యూ ఎం ఎడిషన్ కోసం బీఎండబ్ల్యూ. SK టెలికామ్‌తో కలిసి శాంసంగ్ పనిచేసింది. ఈ కొత్త ఎడిషన్ దక్షిణ కొరియాలో మాత్రమే అందుబాటులో ఉండనుందని సమాచారం.. ఇందులో కేవలం 1000 యూనిట్లను మాత్రమే ఉత్పత్తి చేస్తుంది. అంటే 1,000 మంది మాత్రమే ఈ ఫోన్‌ను కొనుగోలు చేయగలరన్న మాట.