భీమ్లా నాయక్ చిత్రంతో సంయుక్త మీనన్ టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. గ్లామర్ తో పాటు హుషారైన హీరోయిన్ గా సంయుక్త గుర్తింపు సొంతం చేసుకుంది. తాజాగా బింబిసార చిత్రంతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది ఈ మలయాళీ బ్యూటీ.
ఆ తర్వాత కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ‘బింబిసార’ మూవీతో పలకరించింది. ఇక ఈ భామ బింబిసార తర్వాత తెలుగులో ఇటీవల విడుదలైన సార్ సినిమాతో సందడి చేసింది. ఈ సినిమాను వెంకీ అట్లూరి దర్శకత్వం వహించగా.. ధనుష్ హీరోగా నటించారు.
సంయుక్త మీనన్ ఇదే జోరు కొనసాగిస్తే త్వరలోనే టాలీవుడ్ లో టాప్ లీగ్ లోకి ఎంటర్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఆమె నటించిన రెండు చిత్రాలు వరుసగా విజయం సాధించడం అదృష్టం అనే చెప్పాలి.
తెలుగు తమిళ ద్విభాషా చిత్రంగా సార్ రూపొందింది. ఫిబ్రవరి 17న రిలీజైన ఈ చిత్రానికి అందరి నుంచి పాజిటివ్ టాక్ వస్తోంది. అంటే సంయుక్త మీనన్ ఖాతాలో మరో హిట్ పడ్డట్లే.