చిత్ర సీమలో విషాదం.. గుండెపోటుతో దర్శకుడు కన్నుమూత

-

సినీ పరిశ్రమలో ఈమధ్య వరుసగా చాలా విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. దేశంలోని ఏదో ఒక చిత్ర పరిశ్రమ నుంచి విషాద వార్తలు వినాల్సి వస్తోంది. ఈ వార్తలు విని సినీ అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. తమ అసమాన ప్రతిభతో ఆకట్టుకున్న సినీ ప్రముఖులు మరణించడం వారిని కలచివేస్తోంది. ఇకపోతే, తాజాగా కన్నడ సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ శాండల్​వుడ్ దర్శకుడు కిరణ్ గోవి కన్నుమూశారు. 53 ఏళ్ల వయసులో గుండెపోటుతో ఆయన మృతి చెందారు. ఈ రోజు తన ఆఫీసులో ఆయన గుండెపోటుకు గురయ్యారు.

సడెన్ హార్ట్ ఎటాక్​కు గురైన కిరణ్ గోవీని ఆయన ఆఫీసులోని స్టాఫ్​ వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే హాస్పిటల్​లో ట్రీట్​మెంట్ పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన ఎన్నో హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ‘సంచారి’, ‘పయన’, ‘పారు వైఫ్​ ఆఫ్​ దేవదాస్’, ‘యారిగే యారింటు’ లాంటి పలు మూవీస్​ను కిరణ్​ గోవి తెరకెక్కించారు. పలు తెలుగు చిత్రాలకూ ఆయన దర్శకత్వం వహించారు. తెలుగులో ‘తిరుగుబోతు’ అనే ఫిల్మ్​ను కిరణ్ డైరెక్ట్ చేశారు. ఆయన మరణంతో శాండల్​వుడ్​లో విషాదం నెలకొంది. కిరణ్​ మృతిపై కన్నడ సినీ ప్రముఖులు అందరు సంతాపం తెలియజేశారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version