సంగారెడ్డిలో కారు-కాంగ్రెస్ మధ్యే పోరు..జగ్గారెడ్డికి మళ్ళీ దక్కేనా?

-

తెలంగాణ రాజకీయాల్లో జగ్గారెడ్డి గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదనే చెప్పాలి. ప్రత్యర్ధులపైనే కాదు..సొంత పార్టీ వాళ్లపై కూడా ఫైర్ అయ్యే నేచుర్ ఉన్న జగ్గారెడ్డికి సంగారెడ్డి స్థానం ఓ కంచుకోట లాంటిది. ఇక్కడ మూడుసార్లు సత్తా చాటిన జగ్గారెడ్డి..నాల్గవ సారి కూడా గెలవాలని చూస్తున్నారు. కానీ ఈ సారి ఆ అవకాశం ఇవ్వకూడదని అధికార బి‌ఆర్‌ఎస్ పార్టీ ప్రయత్నిస్తుంది. అయితే ప్రస్తుతం సంగారెడ్డిలో పార్టీల బలాబలాలు ఒక్కసారి చూస్తే.

ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలంతో పాటు జగ్గారెడ్డికి సొంత బలం ఉంది. మొదట ఈయన బి‌జే‌పిలో రాజకీయ జీవితం మొదలుపెట్టి..కౌన్సిలర్‌గా, మున్సిపల్ ఛైర్మన్ గా పనిచేశారు. తర్వాత బి‌ఆర్‌ఎస్ లోకి వచ్చి 2004లో సంగారెడ్డి నుంచి గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి జంప్ కొట్టారు. 2009లో మళ్ళీ అదే స్థానం నుంచి కాంగ్రెస్ లో గెలిచారు. ఇక 2014 ఎన్నికల్లో జగ్గారెడ్డి ఓడిపోయారు. 2018 ఎన్నికలోచ్చేసరికి జగ్గారెడ్డి స్వల్ప మెజారిటీతో మళ్ళీ గెలిచారు.

 

ఇలా మూడోసారి గెలిచిన జగ్గారెడ్డి అధికార బి‌ఆర్‌ఎస్ పార్టీపై చేసే పోరాటంతో పాటు సొంత పార్టీపై కూడా పోరాడుతున్నారు. టి‌పి‌సి‌సి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా అనేకసార్లు గళం విప్పారు. దీంతో ఈయన బి‌ఆర్‌ఎస్ లోకి వెళుతున్నారనే ప్రచారం వచ్చింది. కానీ ఎట్టి పరిస్తితుల్లోనూ కాంగ్రెస్ పార్టీని వదలనని జగ్గారెడ్డి అంటున్నారు.

అదే సమయంలో వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేసేది డౌట్ అని తెలుస్తోంది..ఇప్పటికే ఆయన తన కుమార్తెని రంగంలోకి దింపాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. కానీ ఇప్పుడున్న పరిస్తితుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రయోగాలు చేయడం డౌటే. ఇక ఎవరు బరిలో దిగిన సంగారెడ్డిలో కాస్త జగ్గారెడ్డికి అనుకూల పరిస్తితులు ఉన్నాయి. బి‌ఆర్‌ఎస్ నుంచి చింతా ప్రభాకర్ ఉన్నారు..ఈయన కూడా ఎక్కువగానే ఫోకస్ చేసి పనిచేస్తున్నారు. ఇక్కడ బి‌జే‌పికి పెద్ద బలం లేదు. ఆ పార్టీకి మూడో స్థానమే. మొత్తానికి సంగారెడ్డిలో కాంగ్రెస్, బి‌ఆర్‌ఎస్ ల మధ్యే పోరు ఉంటుంది. మరి ఈ సారి జగ్గారెడ్డికి గెలుపు దక్కుతుందో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version