Sanjay Dutt: KGF2 నాకెంతో ప్రత్యేకం..ప్రశంసలన్నీ ప్రశాంత్‌కే దక్కాలన్న సంజయ్ దత్

-

KGF2 ఫిల్మ్.. సినీ విశ్లేషకుల అంచనాను దాటుకుని ముందుకు వెళ్తున్నది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ సంజయ్ దత్, రవీనా టండన్ కీ రోల్స్ ప్లే చేశారు. వీరిరువురికి ఈ పిక్చర్ లో చక్కటి పేరు వచ్చింది. సంజయ్ దత్ ‘అధీర’ పాత్రలో అలరించగా, రవీనా టండన్ ‘రమికా సేన్’ గా నటించింది.


ఇప్పటి వరకు ఉన్న రికార్డులన్నిటినీ తిరగ రాస్తు ముందుకెళ్తున్న KGF2 విజయం గురించి సంజయ్ దత్ స్పందించారు. KGF2 ఫిల్మ్ తనకెంతో ప్రత్యేకమని పేర్కొన్నారు సంజుబాబా. ఈ సినిమా గురించి ట్విట్టర్ వేదికగా ఎమోషనల్ లెటర్ షేర్ చేశారు సంజయ్.

కొన్ని సినిమాలు మనకెంతో ప్రత్యేకంగా నిలుస్తాయని, తానెప్పుడూ తన కంఫర్ట్ నుంచి బయటకు రావడం కోసం వెతుకుతుంటానని, KGF2 తనకు అలాంటిదేనని తెలిపారు సంజయ్ దత్. సినిమా పొటెన్షియాలిటీ తనకు KGF2 మరోసారి తెలిపిందని, లైఫ్ ఎప్పుడూ ఏదో ఒక సర్ ప్రైజ్ ఇస్తుందని, దానిని గొప్పగా మలచుకోవడం మన చేతుల్లో ఉంటుందని స్పష్టం చేశారు.

ఫిల్మ్ అనేది ప్యాషన్ అని ఎందుకంటారో తనకు KGF2 అర్థమైందని వివరించారు. ‘అధీర’ పాత్రను దర్శకులు ప్రశాంత్ నీల్ తనకు కంప్లీట్ గా అప్పగించారని, తనకు అందుతున్న ప్రశంసలన్నీ కూడా దర్శకుడు ప్రశాంత్ నీల్ కే దక్కాలని అన్నాడు. వెండితెరపైన మేము అలా కనబడటం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కల అని పేర్కొన్నారు సంజయ్ దత్.

Read more RELATED
Recommended to you

Latest news