అక్టోబ‌ర్ 10 వ‌ర‌కూ ఈడీ క‌స్ట‌డీకి ఆప్ ఎంపీ

-

ఢిల్లీ లిక్క‌ర్ పాలసీ కేసులో బుధ‌వారం అరెస్ట్ అయిన‌ ఆప్ నేత‌, రాజ్య‌స‌భ ఎంపీ సంజ‌య్ సింగ్‌ను అక్టోబ‌ర్ 10 వ‌ర‌కూ ఈడీ క‌స్ట‌డీకి త‌ర‌లించారు. గ‌త ఏడాదిగా ప‌లువురు ఆప్ నేత‌ల‌ను ఈడీ అరెస్ట్ చేసింది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియా, మంత్రి స‌త్యేంద‌ర్ జైన్‌ల‌ను ఇప్ప‌టికే ఈడీ వేర్వేరు కేసుల్లో ద‌ర్యాప్తు సంస్ధ అరెస్ట్‌ చేసింది. కాగా త‌న అరెస్ట్‌కు ముందు ఆప్ ఎంపీ సంజయ్‌ సింగ్‌ ఒక వీడియో సందేశాన్ని రికార్డు చేశారు. అవినీతికి వ్యతిరేకంగా తన పోరాటం కొనసాగుతుందని అందులో పేర్కొన్నారు. చావనైనా చస్తాను కానీ, తలొగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అదానీ స్కామ్‌లను తాను బహిర్గతం చేశానని, ఈడీకి ఫిర్యాదులు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని అన్నారు.

ఇదిలా ఉండగా.. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసుతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ ఆరోపణలపై సంజయ్ సింగ్ను ఈడీ అధికారులు బుధవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అరెస్టుకు ముందు ఉదయం నుంచి దాదాపు 9 గంబుల పాటు ఈడీ అధికారులు ఆయన నివాసంలో సోదాలు చేశారు. సంజయ్ సహా ఆయన కుటుంబసభ్యులను ప్రశ్నించారు. అనంతరం మనీ లాండరింగ్ అవియోగాలపై ఆప్ నేతను అదుపులోకి తీసుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version