తీజ్‌ ఉత్సవాల్లో మంత్రి సత్యవతి రాథోడ్‌ ఆట,పాట

-

గిరిజనుల సాంస్కృతిక పండుగ తీజ్ ఉత్సవాలు జిల్లాలో ఘనంగా జరిగాయి. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తీజ్ ఉత్సవాల్లో పాల్గొని ఆడిపాడి అందరి దృష్టిని ఆకర్షించారు. బయ్యారం మండలంలో జరిగిన తీజ్‌ ఉత్సవాల్లో ఎంపీ కవిత, జెడ్పీ చైర్ పర్సన్ అంగోత్ బిందు, ఎమ్మెల్యే హరిప్రియ నాయక్‌తో కలిసి ..గోధుమ మొలకల బుట్టలను నెత్తిన పెట్టుకొని నృత్యం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ప్రకృతిని ఆరాధిస్తూ చేసుకునే గొప్ప పండుగ తీజ్ అన్నారు. సీఎం కేసీఆర్‌ గిరిజన పండుగలను అధికారికంగా నిర్వహిస్తున్నారని తెలిపారు సత్యవతి రాథోడ్. అలాగే స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేయాలని సూచించారు సత్యవతి రాథోడ్.

ఘనంగా తీజ్ ఉత్సవాలు..ఆడిపాడిన మంత్రి సత్యవతి రాథోడ్‌

శాంతియుత మార్గంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని మంత్రి పేర్కొన్నారు సత్యవతి రాథోడ్. ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు, ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వు ఉండాలన్నదే సీఎం కేసీఆర్‌ లక్ష్యమన్నారు సత్యవతి రాథోడ్. స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని భావితరాలకు అందించాలనే లక్ష్యంతోనే వజ్రోత్సవ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వ ఘనంగా నిర్వహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్‌ చైర్మన్ మూల మధుకర్ రెడ్డి, ఎంపీపీ చేపూరి మౌనిక, ఎంపీటీసీలు శైలజ, తమ్మిశెట్టి కుమారి,సేవాలాల్ సేన జాతీయ అధ్యక్షుడు భూక్య సంజీవ నాయక్, టీఆర్‌ఎస్‌ నాయకులు శ్రీకాంత్ నాయక్, చెరుపుల శ్రీనివాస్ పాల్గొన్నారు సత్యవతి రాథోడ్.

Read more RELATED
Recommended to you

Latest news