నన్ను రాజకీయంగా ఎదుర్కొనలేకే కుట్రలు : గోరంట్ల మాధవ్‌

ఏపీలో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ న్యూడ్‌ వీడియో ఘటనపై ఇంకా విమర్శలు వస్తూనే ఉన్నాయి. ప్రధానం ప్రతిపక్ష పార్టీలు ఈ వీడియోను ఆయుధంగా చేసుకొని గోరంట్ల మాధవ్‌పై విమర్శలు గుప్పిస్తున్నాయి. అంతేకాకుండా.. వైసీపీ ప్రభుత్వంను టార్గెట్‌ చేస్తూ నిప్పులు చెరుగుతున్నారు. అయితే.. తాజాగా.. న్యూడ్‌ వీడియోను ఎదుర్కొంటున్న హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ టీడీపీ అధినేత చంద్రబాబు ఓటుకునోటు కేసుపై స్పందించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు నోటు కేసులో ఇరుకున్న చంద్రబాబు ఆడియో కేసును స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపిస్తే తనపై వచ్చిన ఆరోపణలపై విచారణకు తానూ కూడా సిద్ధమేనని ప్రకటించారు గోరంట్ల మాధవ్‌. చంద్రబాబు ఆడియోను అమెరికా ల్యాబ్‌లో టెస్ట్‌ చేయించాలని డిమాండ్‌ చేశారు గోరంట్ల మాధవ్‌.

Viral: YCP MP Gorantla Madhav's Vulgar Video Call

ఇటీవల ఒక సామాజిక వర్గానికి చెందిన కొంతమంది టీడీపీ నాయకులు తనపై ఫేక్‌ వీడియో కాల్‌ను సృష్టించి దుష్ప్రచారం చేశారని ఆరోపించారు బ. ఒరిజనల్‌ వీడియో తన వద్ద ఉందని పోలీసులు అడిగితే ఫోన్‌ ఇస్తానని వెల్లడించారు గోరంట్ల మాధవ్‌. ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. మహిళతో అసభ్యకరంగా వీడియోకాల్లో మాట్లాడినట్లు రుజువు కాలేదని వివరించారు. తనను రాజకీయంగా ఎదుర్కొనలేకే కుట్రలతో ఇబ్బందులపాలు చేయాలని టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు గోరంట్ల మాధవ్‌.