వారికి ఎస్బీఐ గుడ్ న్యూస్.. లోన్ లో ప్రత్యేక డిస్కౌంట్.. అర్హతలు, కావాల్సిన డాక్యుమెంట్లు మొదలైన వివరాలివే..!

-

దేశీయ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్నో రకాల సేవలను కస్టమర్స్ కి అందిస్తోంది. దీని వలన చాలా మందికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటోంది. అయితే ఇప్పుడు రుణ గ్రహీతలకు తక్కువ వడ్డీ రేటుకే గృహ రుణాలు అందిస్తోంది స్టేట్ బ్యాంక్. మహిళలకి అయితే ప్రత్యేకమైన ప్రయోజనాలు ఇస్తోంది.

మరి ఇక పూర్తి వివరాల లోకి వెళితే.. ఈ హోమ్ లోన్స్ క్రెడిట్ స్కోర్‌తో లింక్ అయ్యి ఉంటాయి. అందువల్ల సిబిల్ స్కోర్ బాగా ఉంటే మంచిది. పైగా అధిక రుణ మొత్తం కూడా పొందే అవకాశం ఉంటుంది. ఇక ఎస్‌బీఐ అందిస్తున్న హోమ్ లోన్స్ గురించి పూర్తి వివరాలు చూసేద్దాం.

ఎస్‌బీఐ రెగ్యులర్ హోమ్ లోన్ ప్రత్యేకతలు ఇవే:

మహిళలకు వడ్డీ రేటులో తగ్గింపు ఉంటుంది. అలానే ఓవర్ డ్రాఫ్ట్ రూపంలో కూడా హోమ్ లోన్ సౌకర్యం కూడా వుంది.
30 ఏళ్ల వరకు రీపేమెంట్ ఆప్షన్ పొందొచ్చు.
డెయిలీ రెడ్యూసింగ్ బ్యాలెన్స్‌పై వడ్డీ వసూలు.
ప్రిపేమెంట్ పెనాల్టీ చార్జీలు ఉండవు మరియు హిడెన్ చార్జీలు ఉండవు.
తక్కువ వడ్డీ రేటు మరియు తక్కువ ప్రాసెసింగ్ ఫీజు.

లోన్ అర్హతల వివరాలు:

ఇక ఎవరు లోన్ ని తీసుకోచ్చు అనేది చూస్తే.. లోన్ తీసుకోవాలనుకునే వారు భారతీయ పౌరులు అయ్యి ఉండాలి. అలానే కనీస వయసు 18 ఏళ్లు ఉండాలి. 70 ఏళ్లలోపు వయసు కలిగి ఉండాలి. 30 ఏళ్ల వరకు లోన్ టెన్యూర్.

కావాల్సిన డాక్యుమెంట్లు వివరాలు:

లోన్ పొందాలంటే ఎంప్లాయర్ ఐడీ కార్డు, మూడు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు, ఆధార్ కార్డు, పాన్ కార్డు, ప్రాపర్టీకి సంబంధించిన వివరాలు, డాక్యుమెంట్లు కావాలి. అలానే కన్‌స్ట్రక్షన్ పర్మిషన్, రిజిస్టర్డ్ అగ్రిమెంట్ ఫర్ సేల్, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్, మెయింటెన్స్ బిల్లు, ఎలక్ట్రిసిటీ బిల్లు వంటివి అవసరం.

వడ్డీ రేట్లు గురించి చూస్తే.. క్రెడిట్ స్కోర్ ని బట్టి ఇవి ఉంటాయి. 800కు పైన స్కోర్ ఉంటే వడ్డీ రేటు 6.65 శాతంగా ఉంది. 750 – 799 స్కోర్ ఉంటే 6.75 శాతం వడ్డీ పడుతుంది. అదే 700 – 749 మధ్యలో క్రెడిట్ స్కోర్ ఉంటే 6.85 శాతం, 650 – 699 మధ్యలో ఉంటే వడ్డీ రేటు 6.95 శాతంగా ఉంటుంది. అలానే 550- 649 కి 7.15 శాతం, సిబిల్ స్కోర్ లేకపోతే 6.85 శాతం పడుతుంది. మహిళలకు వడ్డీ రేటులో 5 బేసిస్ పాయింట్ల తగ్గింపు ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version