విద్యార్థులకు శుభవార్త.. త్వరలోనే స్కాలర్‌షిప్‌లు విడుదల

-

గత కొన్ని నెలలుగా స్కాలర్‌షిప్‌లు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులకు శుభవార్త. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, వికలాంగులు, మైనార్టీ విద్యార్థులకు సంబంధించి ఉపకార వేతనాల విడుదలపై హైదరాబాద్‌లోని అరణ్య భవన్‌లో సమీక్ష నిర్వహించారు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు. ఆరు శాఖలకు సంబంధించి ఈ నెల 31వ తేదీ వరకు ఇవ్వాల్సిన రూ. 362.88 కోట్ల ఉపకార వేతనాలు వెంటనే విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి హరీశ్ రావు. దీంతో పాటు మార్చి 31 వ తేదీలోగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, విగలాంగులు, ఈబీసీ, మైనార్టీ శాఖల నుంచి బిల్లులు అందలేదన్న కారణంతో.. ట్రెజరీ అధికారులు తిప్పి పంపారని అధికారులు వివరించడంతో దీనిపైన సమీక్షించారు మంత్రి హరీశ్ రావు.

ఇందుకు సంబంధించిన బిల్లులను సంబంధింత శాఖలు తిరిగి ట్రెజరీకి సమర్పించాలని, ఆ బిల్లులను వెంటనే ట్రెజరీ అధికారులు క్లియర్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు మంత్రి హరీశ్ రావు. దీంతో పాటు 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉపకారవేతనాల బీఆర్వోలను వి డుదల చేయాలన్నారు మంత్రి హరీశ్ రావు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version