కామారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రైతు భూమిలో బ్యాంకర్ల ఫ్లెక్సీ కలకలం రేపుతోంది. తాజాగా కామారెడ్డి జిల్లాలోని రైతు భూమి లో ఫ్లెక్సీ కలకలం రేపింది. డి సి సి బి. బ్యాంక్ పేరుతో రైతు పొలం లో భూమి స్వాధీనం పేరిట ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. వ్యవసాయ రుణం చెల్లించకపోవడం తో రైతు భూమి స్వాధీనానికి అధికారులు పొలం లో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.
జుక్కల్ నియోజకవర్గం నాగల్ గావ్ లో ఫ్లెక్సీ కలకలం రేపుతోంది. 2016 లో సాగు భూమి తనకా పట్టి 6 లక్షల రుణం తీసుకున్నాడట రైతు. వడ్డీ తో కలిపి 14 లక్షలకు చేరుకున్నాయట బకాయిలు. అయితే.. ఆ బకాయిలు చెల్లించకపోవడం తో భూమి స్వాధీనానికి అధికారులు నిర్ణయం తీసుకున్నారట. ఈ తరునంలోనే… రైతు భూమి లో ఫ్లెక్సీ కలకలం రేపింది. ఇక ఫ్లెక్సీ ఏర్పాటు..చర్చనీయాంశంగా మారింది.