పీసీసీ ప్రెసిడెంట్‌ని మా దగ్గరకి రావద్దు అనే అధికారం ఎవరికి లేదని స్పష్టం చేశారు సీఎసీ చైర్మన్ షబ్బీర్ అలీ. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీపీసీసీ రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్లొచ్చని ఆయన వెల్లడించారు. అయితే నిజామాబాద్‌లో పార్టీ బలహీనంగా ఉంది అనడం సరికాదన్నారు. టీఆర్ఎస్‌కి ధీటుగా కాంగ్రెస్ ఉందని, కోమటిరెడ్డి నిజామాబాద్ వస్తున్నట్టు తెలియదన్నారు. వచ్చేటప్పుడు చూద్దామని ఆయన వ్యాఖ్యానించారు. పీసీసీ పర్యటన అడ్డుకుంటే చర్యలు తప్పవు ఆయన హెచ్చరించారు.
పీసీసీ వస్తున్నా అంటే ఏర్పాట్లు చేయాల్సిందేనని, నల్గొండ పర్యటనలో ఏర్పాట్లు చేయని వాళ్లపై చర్యలు ఉంటాయని ఆయన మండిపడ్డారు. ఈ విషయంపై పీఏసీలో చర్చిస్తామన్నారు. ఇదిలా ఉంటే.. నేడు టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి నల్గొండలో పర్యటించారు. ఈ సందర్భంగా భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి ఈ కార్యక్రమానికి హజరుకాలేదు. అంతేకాకుండ అక్కడి నల్గొండ కాంగ్రెస్ నేతలు రేవంత్ పర్యటనకు సరైనా ప్రణాళిక గానీ, ఏర్పాట్లు గానీ చేయకపోవడంతో మరోసారి టీ కాంగ్రెస్‌లో విభేదాలు బయటపడ్డాయని చర్చించుకుంటున్నారు.