కుమార్తెకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన శంకర్.. కారణం తెలిస్తే షాక్..!

-

ప్రముఖ క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. రజనీకాంత్ ను మొదలుకొని నేటితరం రామ్ చరణ్ వరకు ప్రతి ఒక్కరితో కూడా ఈయన సినిమాలను తెరకెక్కించే పనిలో చాలా బిజీగా ఉన్నారని చెప్పాలి. ముఖ్యంగా దర్శకుడు శంకర్ సినిమా అంటే భారీ బడ్జెట్ చిత్రాలను తెరకెక్కిస్తారు అని ఇప్పటికే ఆయనపై ముద్ర కూడా ఉంది. ఇక బాలీవుడ్ స్టార్ హీరోలు కూడా ఈయన దర్శకత్వంలో సినిమాలు చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. ఇక ప్రస్తుతం శంకర్.. రామ్ చరణ్ కాంబినేషన్లో ఒక సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఆయన కుటుంబం విషయానికి వస్తే ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు కూడా ఉన్నారు. ఆడపిల్లలు ఇద్దరూ డాక్టర్ కోర్స్ పూర్తి చేశారు. ఇక ఈయన పెద్ద కూతురు అదితి శంకర్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.

ఇక ఈమె వీరు మాన్ చిత్రంతో హీరోయిన్గా కార్తీ హీరోగా ఈ చిత్రంలో నటించారు. ఇక నటన అంటే ఈమెకు మొదటి నుంచి ఆసక్తి ఎక్కువ. అయితే ఈమె సినిమాల్లోకి రావడం ఆమె తండ్రి శంకర్ కి ఏ మాత్రం ఇష్టం లేదు. ఇక ఈ విషయాన్ని అదితి స్వయంగా వెల్లడించారు. ఆడియో విడుదల వేదికపై ఈమె మాట్లాడుతూ.. నేను సినిమాల్లోకి రావడం మా నాన్నకు అస్సలు ఇష్టం లేదు.. కానీ నేనే ఒప్పించాను.. ఒకవేళ హీరోయిన్గా సక్సెస్ కాకపోతే మళ్లీ వైద్య వృత్తిని చేపడుతాను అని నాన్నకు నచ్చ చెప్పాను. దాంతో ఆయన ఒప్పుకున్నాడు అంటూ వెల్లడించింది.

ఇదంతా ఇలా ఉండగా కుమార్ దర్శకత్వంలో శింబు హీరోగా నటించబోతున్న చిత్రంలో ఈమెకు హీరోయిన్గా అవకాశం లభించిందట. కానీ ఈ ఆఫర్ శంకర్ కు నచ్చలేదట. దాంతో ఈ సినిమాలో నటించొద్దని ఆమెకు వార్నింగ్ కూడా ఇచ్చారట. శంకర్ ఇలా చెప్పడానికి కారణం శింబు మీద వచ్చే రూమర్సే అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా శింబుపై అనేక వివాదాలు రావడం, ప్రేమ వివాదాల్లో సంచలన నటుడు గా పేరు తెచ్చుకోవడంతో అతడితో కలిసి సినిమాలు చేయొద్దని శంకర్ తన కుమార్తెకు సూచించారని సమాచారం. మరి తండ్రి మాటను అదితి వింటుందో లేదో తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version