సీన్ రివర్స్: మహిళా కమిషన్‌కు గులాబీ నేతలపై షర్మిల ఫిర్యాదు!

-

తెలంగాణ రాజకీయాల్లో మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసే మహిళా నాయకురాలా సంఖ్య పెరుగుతుంది. రాజకీయంగా ఒకరినొకరు టార్గెట్ చేసుకుంటూ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసుకుంటున్నారు. నేతలు హద్దులు దాటి తిట్టుకోవడంతో ఈ పరిస్తితి వచ్చింది. ఆ మధ్య తెలంగాణ గవర్నర్‌పై బి‌ఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అసభ్య పదజాలంతో దూషించారు. దీనిపై మహిళా కమిషన్‌కు ఫిర్యాదులు వెళ్ళడం..కౌశిక్ కు నోటీసులు రావడం, అలాగే కౌశిక్ క్షమాపణ చెప్పడం జరిగాయి.

ఇక ఇటీవల లిక్కర్ స్కామ్ లో కవితని ఈడీ విచారణకు పిలవడంపై బి‌జే‌పి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్..అవినీతి చేసిన వారిని అరెస్ట్ చేయకపోతే ముద్దు పెట్టుకుంటారా? అని కామెంట్ చేశారు. దీనిపై మూడు రోజుల తర్వాత బి‌ఆర్‌ఎస్ శ్రేణులు నిరసన తెలియజేశాయి. బండి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే బండిపై మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేయగా, ఆయనకు నోటీసులు వచ్చాయి. త్వరలోనే ఆయన కమిషన్ ముందు హాజరవుతారు.

ఇదిలా ఉండగానే తాజాగా వైఎస్ షర్మిల..బి‌ఆర్‌ఎస్ నేతలపై మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. అసభ్యకరంగా దూషించిన వీడియోలను మహిళా కమిషన్ ముందు పెట్టారు. మహిళలు అనే గౌరవం బీఆర్‌ఎస్ పార్టీకి లేదని, ప్రజా సమస్యలు తెలుసుకుంటూ పాదయాత్ర చేస్తున్న తనపై దాడులకు దిగుతున్నారని తెలిపారు.

కేసీఆర్ కొడుకు కేటీఆర్ ఆడవాళ్ళు అంటే వ్రతాలు చేసుకోవాలని,   మహిళలు అంటే ఒక మత్రికి మరదలుతో సమానం అంటారని షర్మిల ఫిర్యాదు చేశారు. ప్రజా సమస్యలు ఎత్తి చూపిస్తే శిఖండి అని వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారు అంటూ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. వైఎస్ షర్మిల ఇచ్చిన ఫిర్యాదుపై మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖ శర్మ సానుకూలంగా స్పందించారు. అసభ్యకర పదజాలంతో దూషించిన వారిపై చర్యలు తీసుకుంటామని షర్మిలకు హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news