షర్మిల కూడా తన అన్న జగన్ బాటలోనే రాజకీయాలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. రాజన్న రాజ్యం తెస్తానని జగన్ అధికారంలోకి వచ్చాడు. ప్రచారం సమయంలో నేను విన్నాను, నేను ఉన్నాను అనే నినాదం ఎత్తుకున్నాడు. ఇప్పుడు షర్మిల కూడా తెలంగాణలో నిరుద్యోగ సమస్యలపై అదే నినాదం ఎత్తుకుంటోంది.
మీ సమస్యలు నేను విన్నాను. మీకోసం నేను నిలబడతాను అనే సేమ్ డైలాగ్ కొడుతోంది. ఇక్కడ ఆమె ఏ విమర్శ చేసినా.. అందులో తండ్రి పేరు కంపల్సరీ. మరి ఆయన పేరు లేకుంటే ఈమెను ఎవరూ పట్టించుకోరని అలా చెప్తుందా అనే సందేహం కలుగుతోంది. ఇప్పటికే రాజన్న హయాంలో అలా ఉండేది మళ్లీ ఆ రాజ్యం తెస్తాం అంటూ సేమ్ అన్న డైలాగ్‌లను కాపీ కొడుతోంది. మరి ఈ డైలాగులు ఎంత వరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.