షర్మిల బలం పెంచేస్తున్నారు..ఓట్ల చీలిక కలిసొచ్చేలా?

-

తెలంగాణ రాజకీయాల్లో షర్మిలని అనూహ్యంగా హైలైట్ చేసే దిశగా అధికార బీఆర్ఎస్ ముందుకెళుతున్నట్లు కనిపిస్తోంది. మామూలుగా చూసుకుంటే తెలంగాణలో షర్మిల పార్టీకి పెద్ద బలం లేదు. ఆమె వైఎస్సార్టీపీ పెట్టింది గాని..ఆ పార్టీ పెద్దగా బలోపేతం కాలేదు. కానీ పార్టీని బలోపేతం చేయడానికి ప్రజల్లో తిరుగుతూనే ఉన్నారు. పాదయాత్ర చేస్తూ..కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులని గట్టిగా టార్గెట్ చేస్తున్నారు.

అయితే ఎన్ని విమర్శలు చేసిన ఆమెకు బీఆర్ఎస్ నేతల నుంచి పెద్దగా కౌంటర్లు రాలేదు. దీంతో ఆమె రాజకీయం పెద్దగా హైలైట్ కాలేదు. కానీ ఇటీవల నర్సంపేట ఎపిసోడ్ నుంచి సీన్ మారింది. ఆమెపై గులాబీ శ్రేణులు రాళ్ళ దాడి చేయడం, వాహనాలని ధ్వంసం చేయడం , హైదరాబాద్‌లో ట్రాఫిక్ వాళ్ళు ఆమెని కారులో ఉంచే క్రేన్‌తో లాక్కుని వెళ్ళడం, అరెస్ట్ చేయడంతో సీన్ మారింది. షర్మిల హైలైట్ అయింది. ఇప్పుడు హైకోర్టు ఆమె పాదయాత్రకు పర్మిషన్ ఇచ్చినా సరే..పోలీసులు పర్మిషన్ ఇవ్వడం లేదు. ఆమె పాదయాత్రకు అనుమతి లేదు అంటున్నారు.

ఇదంతా అధికార పక్షం చెప్పినట్లే జరుగుతుందని, వారే తన పాదయాత్రని అడ్డుకుంటున్నారని షర్మిల దీక్షకు దిగారు. దాన్ని కూడా అడ్డుకున్నారు. చివరికి లోటస్ పాండ్‌లో ఆమె దీక్షకు దిగారు. ఆ దీక్షకు పార్టీ శ్రేణులు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. ఇలా రాజకీయంగా అడ్డుకునే ప్రయత్నాలు చేసి అనూహ్యంగా షర్మిలని హైలైట్ చేస్తున్నారు..ఆమె బలం పెంచుతున్నారు. ఇలా చేయడం వెనుక బీఆర్ఎస్ వ్యూహాలు ఉన్నాయని తెలుస్తోంది.

అలా బీజేపీని టార్గెట్ చేసి కాంగ్రెస్‌ని దెబ్బకొట్టి..బీజేపీ బలం పెంచారు. దీని వల్ల బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోయే పరిస్తితి వచ్చింది. ఇప్పుడు షర్మిలని హైలైట్ చేస్తున్నారు. ఆమె బలం పెరిగితే..ప్రభుత్వ వ్యతిరేక ఓట్లనే చీల్చుకోవాలి. అంటే చివరికి బీఆర్ఎస్ పార్టీకే మేలు జరిగేలా రాజకీయం నడుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news