వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై తెలంగాణ శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డికి టీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర మంత్రులపై షర్మిల నిరాధార ఆరోపణలు చేస్తున్నారని టీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. శాసన సభ్యుల గౌరవాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్నారని తెలిపారు. ఈమేరకు షర్మిలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు.
అయితే నేతల ఫిర్యాదుకు కౌంటర్ ఇచ్చారు వైయస్ షర్మిల. మంత్రి నిరంజన్‌రెడ్డి మరదలు అని అవమానిస్తే ఊరుకోవాలా? మాకు ఆత్మగౌరవం ఉండదా?.. ఎమ్మెల్యేల అవినీతిపై ప్రజలు చర్చిస్తున్న అంశాలనే ప్రస్తావించాను, పాదయాత్ర ఆపేస్తే మరోలా ప్రజల్లోకి వెళ్తామని హెచ్చరించారు వైఎస్ షర్మిల. స్పీకర్ పోచారం గారు.. నాపై చర్యలకు ఆలోచించే ముందు పరాయి ఆడదాన్ని, ఒక తల్లిని మరదలంటు నన్ను కించపరిచి నన్ను, నాతోటి మహిళలను అవమాన పరిచిన సంస్కార హీనుడైన మంత్రి నిరంజన్ రెడ్డి పై కఠిన చర్యలు తీసుకోవాల్సింది గా విజ్ఞప్తి కోరారు వైఎస్ షర్మిల.