బ్రేకింగ్ : నిమ్స్ ఆస్పత్రిలో చేరిన శివ బాలాజీ

-

మా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో మరో ట్విస్ట్ నెలకొంది. ఈ ఎన్నికలు పూర్తి కాగానే… నటుడు శివ బాలాజీ నిమ్స్ ఆస్పత్రిలో చేరారు. చేతికి గాయమైన నేపథ్యంలో శివబాలాజీ నిమ్స్ ఆసుపత్రిలో చేరారు. ఇవాళ ఉదయం మా ఎన్నికల పోలింగ్ కేంద్రంలో… నటి హేమ… శివ బాలాజీ చేయిని కొరికింది. దీంతో శివ బాలాజీ మోచేతికి… చిన్న గాయం అయింది.

శివ బాలాజీ చెయ్యి నీ నటి హేమ కొరికిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. తాను నిజంగానే కోరికా నని.. వాళ్లు చేసిన తప్పు పనికి కొరకాల్సి వచ్చిందని నటి హేమ క్లారిటీ ఇచ్చింది. ఇక ఇటు… శివ బాలాజీ మరియు నరేష్… ఈ ఘటనపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

ఓడిపోతామనే భయంతోనే నటి హేమ భౌతిక దాడికి ప్రయత్నించిందని ఆరోపణలు చేశారు. ఇది ఇలా ఉండగా తాజాగా శివబాలాజీ ఏకంగా ఈ ఘటనపై నిమ్స్ ఆసుపత్రిలో చేరడం కలకలం రేపుతోంది. ప్రస్తుతం శివ బాలాజీ.. కి నిమ్స్ ఆస్పత్రిలో వైద్యులు శస్త్ర చికిత్స అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version