మణిపూర్‌లో షూట్‌ ఎట్‌ సైట్‌ ఆర్డర్స్‌..

-

రాష్ట్రవ్యాప్తంగా గిరిజనులు మరియు మెజారిటీ మెయిటీ కమ్యూనిటీకి మధ్య ఘర్షణలు చెలరేగడంతో మణిపూర్ గవర్నర్ గురువారం రాష్ట్ర హోం శాఖ యొక్క షూట్-ఎట్-సైట్ ఆర్డర్‌ను ఆమోదించారు. మే 3, బుధవారం గిరిజన సంఘీభావ యాత్రలో హింసాత్మక సంఘటనలు నమోదవడంతో ప్రస్తుత శాంతి భద్రతల దృష్ట్యా ఈ ఉత్తర్వు జారీ చేయబడింది. మరోవైపు ఇంఫాల్‌లో ఆందోళనకారులు ఇప్పటికే అనేక వాహనాలను తగులబెట్టారు. ప్రార్థనా స్థలాలకు నిప్పు పెట్టారు. ముఖ్యంగా చురాచాంద్‌పూర్, ఇంఫాల్‌ నగరాల్లో హింసాకాండ పెచ్చుమీరింది. మెజారిటీగా ఉన్న మెయిటీలను షెడ్యూల్డు తెగల కేటగిరీలోకి తేవాలనే డిమాండ్‌ను ఎస్టీలు వ్యతిరేకిస్తున్నారు.

Manipur: चुराचांदपुर जिले में बवाल के बाद पब्लिक कर्फ्यू और बिष्णुपुर में धारा-144 लागू, देखिए VIDEO | Manipur:Administration alert after uproar, public curfew in Churachandpur district ...

ఈ నిరసనలకు ది ఆల్ ట్రైబల్ స్టూడెంట్స్ యూనియన్ మణిపూర్ నాయకత్వం వహిస్తోంది. అయితే తమకు సంఘీభావం తెలుపుతున్న నిరసనకారులే ఈ హింసాకాండకు పాల్పడుతున్నారనే ఆరోపణలను ఈ సంఘం ఖండించింది. బుధవారం నిర్వహించిన సంఘీభావ ప్రదర్శనలో వేలాది మంది గిరిజనులు పాల్గొన్నారని, ఈ ప్రదర్శన ప్రశాంతంగా ముగిసిందని తెలిపింది. తమ ప్రదర్శన అనంతరం కొందరు వ్యక్తులు చురాచాంద్‌పూర్‌లోని ఆంగ్లో-కుకీ వార్ మెమోరియల్ గేటుకు నిప్పు పెట్టారని, దీంతో హింస ప్రజ్వరిల్లిందని తెలిపింది. ఈ సంఘం ప్రెసిడెంట్ పావోటింఠాంగ్ లుఫెంగ్ మాట్లాడుతూ, ఇంఫాల్‌, తదితర ప్రాంతాల్లో గిరిజనుల ఇళ్లను, ప్రార్థనా స్థలాలను తగులబెట్టారని తెలిపారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news