Shreya Saran.. దానికోసమే దూరం అంటున్న శ్రియా..!

-

తెలుగు చలనచిత్ర పరిశ్రమంలో దాదాపు అందరూ అగ్ర హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల ఒక బిడ్డ పుట్టిన తర్వాత కూడా గ్లామర్ షో చేస్తూ మరింత రచ్చ చేస్తుంది. ప్రస్తుతం టాలీవుడ్ లోనే కాదు కోలీవుడ్, బాలీవుడ్ లో కూడా పలు చిత్రాలలో నటించి దూసుకుపోతుంది. 2001లో ఇష్టం సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ అందాల తార శ్రియా అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అందరి స్టార్ హీరోల సరసన ఆడి పాడిన శ్రియా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. ఇటీవల దృశ్యం 2 సినిమాలో కూడా నటించింది.

ఈ సినిమా భారీ విజయం అందుకోవడంతో మరొకసారి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది ఈ బోల్డ్ బ్యూటీ. ఇకపోతే ఇదిలా ఉండగా శ్రియా తన బిడ్డకు జన్మనిచ్చేంత వరకు కూడా ఆమె ప్రెగ్నెన్సీలో ఉన్నట్టు ఎవరికీ తెలియలేదు. కరోనా సమయంలో అన్ని రహస్యంగా కానిచ్చేసిన ఈ ముద్దుగుమ్మ కూతురు రాధా తో కలిసి ఫోటోలు దిగి ఆ ఫోటోలను షేర్ చేసింది. అభిమానులకు మీడియాకు ఈ విషయం తెలిస్తే నా బాడీ షేప్ గురించి రాస్తారు.. నా బిడ్డ పై దృష్టి పెడతారు.. అందుకే ఇలాంటి వాటిపై దృష్టి పెట్టి సమయాన్ని వృధా చేయాలనుకోలేదు.

ప్రెగ్నెన్సీ విషయాన్ని బయటపెట్టి అసలు విషయం తెలిపింది. మొత్తానికైతే తనపై వస్తున్న బాడీ షేమింగ్ ను అరికట్టడానికి ఆమె ఈ ఫోటోలను షేర్ చేయలేదని స్పష్టం చేసింది. మొత్తానికైతే ఇప్పుడు వరుస గ్లామర్ ఫోటోషూట్లతో మరింత రెచ్చిపోతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version