సింగరేణిలో సమ్మె సైరన్ మోగింది. ప్రైవేటీకరణకు వ్యతిరేఖంగా కార్మికులు సమ్మెలోకి వెళ్లనున్నారు. ఈనెల 28, 29న సార్వత్రిక సమ్మెకు వెళ్లనున్నారు. దీనికి సంబంధించి కార్మిక సంఘాలు సింగరేణి యాజమాన్యానికి సమ్మె నోటీసులు అందించారు. ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్,ఐఎన్టీయూసీ, హెచ్ఎంఎస్ కార్మిక సంఘాలు సమ్మె నోటీసులు ఇచ్చాయి. సింగరేణిలో 4 కోల్ బ్లాక్స్ ను ప్రైవేటీకరించేందుకు, వేలం వేయడానికి కేంద్రం సిద్దమైన నేపథ్యంలో కార్మికులు దీన్ని వ్యతిరేకిస్తు సమ్మెకు వెళ్తున్నారు. నాలుగు బ్లాకులు కళ్యాణిఖని బ్లాక్ 6, కొయ్య గూడెం బ్లాక్ 3, సత్తుపల్లి బ్లాక్ 3, శ్రావణి పల్లి బ్లాకులను ప్రైవేటికరించడాన్ని కార్మికులు వ్యతిరేఖిస్తున్నారు. కేంద్రం ప్రైవేటీకరణను ఆపాలని డిమాండ్ చేస్తున్నారు కార్మికులు. దీనిపై టీాఆర్ఎస్ సర్కార్ కూడా కేంద్రం తీరుపై ఫైర్ అవుతోంది. టీఆర్ఎస్ పార్టీ నాయకులు గనుల ప్రైవేటీకరణను వ్యతిరేఖిస్తున్నారు. సింగరేణి ప్రైవేటీకరణ చేస్తే తమ సత్తా చూపిస్తాం అంటూ కేంద్రానికి వార్నింగ్ ఇస్తున్నారు. గతేడాది డిసెంబర్ లో ప్రైవేటీకరణ కు వ్యతిరేఖంగా మూడు రోజులు సమ్మెకు వెళ్లారు కార్మికులు. డిసెంబర్ 9 నుంచి మూడు రోజుల పాటు సమ్మె చేసి తమ నిరసన తెలిపారు.