ఏంటీ.. ఒక్క ఆలు చిప్ పీస్ రేటు లక్షలా.. అంత రేటు ఎందుకబ్బా?

-

ఆలు చిప్స్ అందరీ ఇష్టం ఉంటుంది.. ఉప్పు, కారం పడితే వాటి రుచి వేరే లెవెల్..అందుకే చిన్నా, పెద్దా అని తేడా లేకుండా అందరు వీటిని ఇష్టపడతారు..అయితే కొన్ని కంపెనీలు ఒక్కో ధర తో విక్రయిస్తారు.చిన్న షాప్ లలో 5 రూపాయలు ఉంటే పెద్ద షాపులలో 10 లేదా20 రూపాయలు ఉంటుంది. ఇక పెద్ద మాల్స్ లో 100 కు మించి ఉండదు. అది కూడా మొత్తం ఫ్యాకేట్..సింగిల్ పీస్ అమ్మడం కొనడం కానీ మనం ఎప్పుడూ చూడలేదు. అలాంటిది ఓ వ్యక్తి సింగిల్ పొటాటో పీస్‌ను లక్షా 63 వేలకు ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టాడు. వినడానికి షాకింగ్‌గా ఉన్నా ఇది నిజం..

ఇంగ్లండ్‌లోని బకింగ్‌హామ్‌షైర్‌కు చెందిన ఓ వ్యాపారి.. పొటాటో చిప్‌ సింగిల్ పీస్‌ను అమ్మకానికి పెట్టాడు. అది కూడా ఈ కామర్స్‌ కంపెనీ ఈబేలో. ఆ సింగిల్ పీస్‌ను 2 వేల యూరోలకు అమ్మకానికి ఉంచాడు. అంటే మన కరెన్సీలో లక్షా 63 వేల రూపాయలు. దీనిని పుల్లటి క్రీమ్, ఆనియన్ ఫ్లేవర్‌తో తయారు చేసినట్లు చెప్పాడు. దీని షేప్ చాలా ప్రత్యేకమైనదని… పైన ఒక అరుదైన మడత ఉంటుందని, ఇదొక సరికొత్త ప్రొడక్ట్ అని డిస్క్రిప్షన్‌లో రాశాడు. ఇది చూసిన కస్టమర్లకు మతిపోయింది. ఒక్క పొటాటో చిప్‌కు 2 వేల యూరోలు ఏంటని చర్చించుకుంటున్నారు..

అక్కడ ఆహార పదార్ధాల పై ఇంత ధర ఉండటం ఇది మొదటి సారి కాదు. చాలా సార్లు ఇలాంటి వింటూనే ఉంటారు. గతంలో ఓ వ్యక్తి రెండు చిప్స్‌ను 50 యూరోలకు అమ్మకానికి పెట్టాడు. ఇటీవల మెక్ డొనాల్డ్‌కి చెందిన చికెన్ నగ్గెట్‌పై ఆన్‌లైన్‌లో బిడ్డింగ్ నిర్వహించగా.. ఓ వ్యక్తి ఏకంగా 73 లక్షలకు కొనుగోలు చేశాడు.దీని ఆకారం కొత్తగా ఉండటంతో రేటు బాగా పోయింది.ఇలా అక్కడ ఫుడ్ కు భారీ డిమాండ్ ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version