‘గాడ్​ఫాదర్​’లో చిరు తండ్రిగా నటించింది ఎవరో తెలుసా?

-

‘గాడ్​ఫాదర్’​ సినిమాలో చిరంజీవి తండ్రిగా నటించిన యాక్టర్​ను మీరు గుర్తుపట్టారా? ఆయన 1986లో తెరకెక్కిన ఆల్​ టైమ్​ క్లాసిక్​ మూవీలో హీరోగా నటించారు. సుమారు 35 ఏళ్ల తర్వాత ఈ సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. ఇంతకీ ఆయన ఎవరంటే?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘గాడ్​ఫాదర్’ మూవీ మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. మలయాళ సూపర్​హిట్ మూవీ ‘లూసిఫర్’ తెలుగు రీమేక్​గా వచ్చిన ఈ సినిమాలో నయనతార, సత్యదేవ్, మురళీశర్మ, ప్రత్యేక పాత్రలో సల్మాన్ ఖాన్ నటించారు. అయితే చిరంజీవి, నయనతారల తండ్రి పాత్రలో ముఖ్యమంత్రిగా నటించిన నటుడిని మాత్రం చాలా మంది తెలుగు ప్రేక్షకులు గుర్తించలేదు. ఆయనే సర్వదామన్ బెనర్జీ. చేసింది కొద్ది సినిమాలే అయినా తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు.

1986లో దిగ్గజ దర్శకుడు కె.విశ్వనాథ్ తెరకెక్కించిన ‘సిరివెన్నెల’ సినిమాలో చిరంజీవితో పాటు సర్వదామన్​ బెనర్జీ ​ హీరోగా నటించారు. అదిరిపోయే పాటలతో ‘సిరివెన్నెల’ సినిమా తెలుగు ఆల్​టైమ్​ క్లాసిక్​ల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాతోనే సీతారామ శాస్త్రి.. సిరివెన్నెల సీతారామశాస్త్రిగా మారారు. తెలుగు భాష రాకపోయినా సినిమాలో అంధుడిలా సర్వదామన్​ బెనర్జీ అద్భుతంగా నటించారు.

ఆ తర్వాత అడపా దడపా సినిమాలు చేసిన ఆయన.. ఆధ్యాత్మిక చింతనలో ఎక్కువ సంవత్సరాలు గడిపారు. 35 ఏళ్ల తర్వాత ‘గాడ్​ఫాదర్’​లో చిరంజీవికి తండ్రిగా రీఎంట్రీ ఇచ్చారు. ఏదేమైనా జనరేషన్​లు మారిపోవడంతో 35 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన సర్వదామన్ బెనర్జీని తెలుగు ప్రేక్షకులు గుర్తుపట్టలేదని సోషల్​మీడియాలో ఎక్కడా ఆయన ప్రస్తావన కనిపించకపోవడం బట్టి తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news