సాహిత్య శిఖరం సిరివెన్నెల మరణానికి కారణాలివే…

-

సిరివెన్నెల సీతారామ శాస్త్రి మరణం రెండు తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు. సినీవినీలాకాశంలో తనదైన ముద్ర వేసిన సిరవెన్నెల మరణం.. సాహిత్యాభినులకు, సినీ ప్రియులను శోఖ సంద్రంలో ముంచింది. ఓ గొప్ప కవిని, ఓ గేయ రచయితను కోల్పోయామని యావత్ తెలుగు రాష్ట్రాల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సిరివెన్నెల మరణం సినిమా రంగానికి భారీ లోటుగా అభివర్ణిస్తున్నారు.

ఇంతలా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల్ని కలిచివేసిన సిరివెన్నెల మరణానికి క్యాన్సర్ ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఆరేళ్ల క్రితమే సిరివెన్నెలకు లంగ్ క్యాన్సర్ వచ్చింది. ఆ సమయంలో ఒక ఊపిరితిత్తిలోని సగభాగాన్ని తీసేశారు. బైపాస్ సర్జీరీ కూడా జరిగింది. ఇటీవలే మరో ఊపిరితిత్తికి క్యాన్సర్ వ్యాపించింది. దీంట్లో కూడా కొంత భాగం తీసేశారు. అయితే రెండు రోజుల వరకు బాగానే ఉన్న సిరివెన్నెల ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. దీనికి తోడు ఉపిరితిత్తుల్లో న్యూమోనియా రూపంలో ఇన్ఫెక్షన్ వ్యాపించింది. సిరివెన్నెలను రక్షించేందుకు 5 రోజుల పాటు ఎక్మోపై ఉంచి చికిత్స అందించారు. అయితే శరీరం అంతా ఇన్ఫెక్షన్ వ్యాపించడంతో పాటు.. కిడ్నీ దెబ్బతినడంతో ఆయన ఈరోజు సాయంత్రం 4.07 నిమిషాలకు మరణించారు.

Read more RELATED
Recommended to you

Latest news