కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య శనివారం విమర్శలు, ప్రతి విమర్శలు చోటచేసుకున్న విషయం తెలిసిందే. కేంద్ర మంత్రిగా స్మృతి ఇరానీ కూతురుకు గోవాలో ఓ బార్ ఉందని, ఆ బార్‌ను ఇరానీ కూతురే నిర్వహిస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు ఘాటు ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు తన చెవినబడిన వెంటనే స్పందించిన స్మృతి ఇరానీ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలను ఖండించారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శల్లో లేశమాత్రం నిజం కూడా లేదని తెలిపారు స్మృతి ఇరానీ.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీని ఈ వివాదంలోకి లాగిన స్మృతి ఇరానీ…అమేథీలో రాహుల్ గాంధీని తాను ఓడించిన కారణంగానే తనను, తన కుటుంబ సభ్యులను కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేస్తోందని ఆరోపించారు స్మృతి ఇరానీ. అయినా 18 ఏళ్ల వయసున్న తన కూతురు ప్రస్తుతం కళాశాలకు వెళుతోందని చెప్పిన ఇరానీ… బార్‌లను నడిపేంత వయసు తన కూతురుకు ఇంకా రాలేదని తెలిపారు స్మృతి ఇరానీ. గోవాలోనే కాకుండా దేశంలో మరెక్కడా కూడా తనకు గానీ, తన కూతురుకు గానీ, తన కుటుంబానికి గానీ బార్లు లేవని స్పష్టం చేశారు స్మృతి ఇరానీ.