BIG BREAKING : తెలంగాణ సీఎస్‌ సోమేష్‌ కుమార్‌ రిలీవ్‌

-

తెలంగాణ సీఎస్‌ సోమేష్‌ కుమార్‌ రిలీవ్‌ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సోమేష్‌ కుమార్‌ను ఏపీకి కేటాయిస్తూ కేంద్రం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎల్లుండిలోగా ఏపీలో రిపోర్ట్‌ చేయాలని ఉత్తర్వు్ల్లో కేంద్రం ప్రభుత్వం పేర్కొంది. హైకోర్టు తీర్పును ప్రస్తావిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కేంద్రం. అయితే.. సోమేష్‌ కుమార్ మరో ఏడాదిలో రిటైర్‌ కానున్నారు. ఈ క్రమంలో వీఆర్‌ఎస్ తీసుకునే ఆలోచనలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. రాష్ట్ర విభజన జరిగిన సమయంలో ఏపీకి సీఎస్‌గా కేంద్రం సోమేశ్‌ కుమార్‌ను కేటాయించగా.. కేంద్రం ఉత్తర్వులను నిలిపివేస్తూ తెలంగాణలో సోమేష్‌ కుమార్ సీఎస్‌గా కొనసాగేలా క్యాట్‌ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.

దీంతో 2017వ సంవత్సరంలో క్యాట్ ఉత్త‌ర్వులు కొట్టేయాల‌ని కోరుతూ కేంద్రం హైకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో దీనిపై విచారణ జరిపిన సీజే ఉజ్జ‌ల్ భూయాన్ ధ‌ర్మాస‌నం మంగళవారం క్యాట్ ఉత్తర్వులు కొట్టివేస్తూ తుది తీర్పు ప్రకటించింది. సీఎస్‌ సోమేష్‌ కుమార్‌ కేటాయింపును రద్దు చేస్తూ.. ఆయనను ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు.

Read more RELATED
Recommended to you

Latest news