టీడీపీ మహానాడు నేడు ప్రారంభమైంది. అయితే ఈ నేపథ్యంలో పలు తీర్మాణాలను పార్టీ నేతలు ప్రవేశపెట్టారు. ఈ క్రమంలోనే.. ప్రజాస్వామిక వ్యవస్థల విధ్వంసంపై తీర్మానాన్ని సోమిరెడ్డి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవస్థలపై సీఎం జగనుకు నమ్మకం లేదని, పరిపాలనా వ్యవస్థను జగన్ భ్రష్టుపట్టించారని ఆయన ఆరోపించారు.
అంతేకాకుండా తన తండ్రి హయాంలో జగన్ చేసిన అవినీతికి ఐఏఎస్సులు జైళ్ల పాలయ్యారని, సీఎం హోదాలో ఉన్న జగన్ మాటను అమలు చేసినందుకు 8 మంది ఐఏఎస్సులకు జైలు శిక్ష విధించింది కోర్టు అని ఆయన విమర్శించారు. అధికారులను వాడుకుని వదిలేయడం జగనుకు అలవాటని, గత ఎన్నికల్లో ఎల్వీ సుబ్రమణ్యాన్ని వాడుకుని.. ఆ తర్వాత గెంటేశారన్నారు. ఎల్వీ సుబ్రమణ్యాన్ని జగన్ లోపలకు పిలిచి ఏం కుమ్మారో ఏమో.. బయటకొచ్చి హైదరాబాద్ వెళ్లిపోయారని, ఎల్వీ సుబ్రమణ్యం హైదరాబాదులో ఉండే పదవిని విరమించారన్నారు. గౌతమ్ సవాంగుని వాడుకుని పక్కన పెట్టేశారని, వివిధ సందర్భాల్లో న్యాయ వ్యవస్ధపై జగన్ సహా వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు అత్యంత బాధ్యతారాహిత్యమని ఆయన మండిపడ్డారు.