జనసేనతో పొత్తుపై సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు

-

జనసేన పదవ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మచిలీపట్నం వేదికగా నిర్వహించిన భారీ బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తులపై ఆసక్తికర కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. తాను బిజెపితో పొత్తులో ఉంటే ముస్లింలు తనకి దూరం అవుతారని కొందరు అంటున్నారని.. వారికి ఇష్టం లేకపోతే నేను బిజెపికి దూరంగా జరుగుతానని అన్నారు పవన్ కళ్యాణ్.

అయితే పొత్తులపై పవన్ కళ్యాణ్ చేసిన చేసిన కామెంట్లపై స్పందించారు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమ వీర్రాజు. కృష్ణాజిల్లా గుడివాడ లో జిల్లాస్థాయి బిజెపి బూత్ స్వశక్తి కిరణ్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న సోమ వీర్రాజు మాట్లాడుతూ.. జనసేన – తెలుగుదేశం పొత్తుపై పవన్ కళ్యాణ్ ఎక్కడ మాట్లాడలేదని గుర్తు చేశారు. టిడిపి తో పొత్తుపై జనసేన క్లారిటీ ఇచ్చిన తర్వాత.. తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామంటూ కీలక వ్యాఖ్యలు చేశారు సోము వీర్రాజు. ఇక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గత నాలుగు ఏళ్ల పాలనలో ఉత్తరాంధ్రకు చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version