కేటీఆర్‌ లాంటి నేత ఉంటే నాలాంటి వాళ్ల అవసరం ఉండదు : సోనుసూద్

-

తెలంగాణ మంత్రి కేటీఆర్ లాంటి నేత ఉంటే తన లాంటి వాళ్లు అవసరం ఎక్కువగా ఉండదని.. బాలీవుడ్ సినీ నటుడు సోనూసూద్ ప్రశంసల వర్షం కురిపించారు. సోమవారం హెచ్ ఐ సి సి లో కరోనా వారియర్స్ సన్మాన కార్యక్రమం తెలంగాణ సోషల్ ఇంపాక్ట్ గ్రూప్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అలాగే సినీ నటుడు సోనూసూద్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సోనూసూద్ మంత్రి కేటీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించారు.

కరోనా తో ఉద్యోగాలు, చదువులు, ఆత్మీయులను కోల్పోయిన వారు చాలా మంది ఉన్నారని తెలిపారు. వాళ్లకు సహాయ పడటమే ఇక ముందు ఉన్న సవాల్ అని పేర్కొన్నారు సోను సూద్.

జమ్ము నుంచి కన్యాకుమారి వరకు తాను సహాయ కార్యక్రమాలు చేసినా… ఒక తెలంగాణ రాష్ట్రం నుంచే సమాంతరంగా ప్రతిస్పందించే వ్యవస్థ కనిపించిందని.. అది ఒక కేటీఆర్ కార్యాలయం మాత్రమేనని సోనూసూద్ ప్రశంసించారు. ఇంకా అంతకుముందు కేటీఆర్ మాట్లాడుతూ.. సోనూసూద్ రాజకీయాల్లోకి వస్తాడని భయంతో అతడిపై దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. అందులో భాగంగానే సోనూసూద్ ఇంటిపై ఐటి అలాగే ఈడి దాడులు జరిగాయన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news