సమ్మర్ లో కొత్త ఫీచర్లు కలిగిన ఎలెక్ట్రిక్ వస్తువులు మార్కెట్ లోకి విడుదల అవుతున్నాయి.ఈ మేరకు తాజాగా సోని కంపెనీ అదిరిపోయే ఫీచర్లతో స్మార్ట్ టీవీ లను లాంచ్ చేసింది.ఈ టీవీ లకు మార్కెట్ లో డిమాండ్ పెరిగింది.టీవీ లాంచ్ అయిన కొద్ది రోజుల్లోనే మంచి ఆదరణ పొందిన సంగతి తెలిసిందే..ఇప్పుడు మార్కెట్ లోకి వచ్చిన స్మార్ట్ టీవీ లు గురించి పూర్తీ వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..సోనీ (Sony) నుంచి ప్రీమియమ్ రేంజ్‌లో స్మార్ట్ టీవీ సిరీస్ భారత్‌లో లాంచ్ అయింది. సోనీ బ్రావియా ఎక్స్80కే (Sony Bravia X80K) సిరీస్‌లో ఐదు డిస్‌ప్లే ఆప్షన్లలతో స్మార్ట్ టీవీలు భారత మార్కెట్‌లోకి వచ్చాయి. 43 ఇంచులు, 50 ఇంచులు, 55 ఇంచులు, 65 ఇంచులు, 75 ఇంచుల డిస్‌ప్లే మోడళ్లు విడుదలయ్యాయి.
HDR10, HGLతో పాటు డాల్బీ విజన్‌కు ఈ డిస్‌ప్లేలు సపోర్ట్ చేస్తాయి. గూగుల్ అసిస్టెంట్, అలెక్సా వాయిస్ అసిస్టెంట్‌లతో పాటు క్రోమ్‌కాస్ట్, యాపిల్ ఎయిర్‌ప్లే సపోర్ట్ కూడా ఉంటుంది.
ఈ స్మార్ట్ టీవీల ధరలు స్పెసిఫికేషన్లు, ఫీచర్లు ఇవే..
4K రెజల్యూషన్ (3840×2160 పిక్సెల్స్)తో కూడిన ఐదు స్క్రీన్ సైజ్‌ల్లో సోనీ బ్రావియా ఎక్స్80కే స్మార్ట్ టీవీలు వస్తున్నాయి. హెచ్‌డీఆర్10, హెచ్‌జీఎల్, డాల్బీ విజన్‌కు ఈ డిస్‌ప్లేలు సపోర్ట్ చేస్తాయి. అలాగే స్క్రీన్‌పై కలర్స్ మరింత అత్యుత్తమంగా ఉండేలా ట్రిలుమినోస్ డిస్‌ప్లేలను ఇస్తున్నట్టు సోనీ పేర్కొంది.
సోనీ 4కే హెచ్‌డీఆర్ ప్రాసెసర్ ఎక్స్1పై ఈ స్మార్ట్ టీవీలు రన్ అవుతాయి. వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్ మెరుగ్గా ఉండేలా పిక్చర్ ఆప్టిమైజేషన్ ఉంటుందని సోనీ చెబుతోంది. ఇక ఈ టీవీల్లో 16జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ఆండ్రాయిడ్ టీవీ ఆధారిత గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్‌తో Sony Bravia X80K టీవీలు వస్తున్నాయి.గూగుల్ ప్లే స్టోర్ ద్వారా యాప్స్ ను కూడా ఇంస్టాల్ చేసుకోవచ్చు.. మరెన్నో ఫీచర్లు ఇందులో అందుబాటులో ఉన్నాయి.
బ్రావియా ఎక్స్80కే 55 ఇంచుల స్మార్ట్ టీవీ ధర రూ.94,900గా ఉంది. అయితే 43 ఇంచులు, 50 ఇంచులు, 65 ఇంచులు, 75 ఇంచుల మోడల్స్ ధరను సోనీ ఇంకా వెల్లడించలేదు. 55 ఇంచుల మోడల్ ఇప్పటికే సేల్‌కు అందుబాటులోకి వచ్చింది. మిగిలిన మోడల్స్ అతి త్వరలోనే అందుబాటులోకి వస్తాయి..ఫీచర్స్, కలర్స్ జనాలను ఆకట్టుకోవడం తో డిమాండ్ పెరిగింది.