త్వరలోనే తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తామని.. మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. ఉమ్మడి పాలన ప్రభుత్వ వైద్య రంగాన్ని విచ్ఛిన్నం చేసి ప్రైవేటును ప్రోత్సహించారని.. కాంగ్రెస్, బీజేపీ పాలకులు ఏనాడూ ప్రజా వైద్యాన్ని పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు. ప్రైవేటు ఆసుపత్రులు పెరిగిపోయాయని…ప్రజలు ప్రతి ఆరోగ్య సమస్యకు ప్రైవేటును ఆశ్రయించాల్సిన పరిస్థితి ఉండేదని వెల్లడించారు.
పేదలు వైద్యంపై అధికంగా ఖర్చు చేసి ఆర్థికంగా చిక్కిపోయేవారని.. ఏదైనా పెద్ద రోగం వస్తే అప్పులు చేసి ప్రాణాలు కాపాడుకోవాల్సిన పరిస్థితులు ఉండేవన్నారు. ఈ పరిస్థితులను మార్చేందుకు అనేక చర్యలు తీసుకున్నారని.. వైద్య రంగాన్ని బలోపేతం చేశారు. గుణాత్మక మార్పు సాధ్యం చేశారు. జిల్లాకొక మెడికల్ కాలేజీ విప్లవాత్మకమైన చర్య అని మండిపడ్డారు.
సమైక్య పాలనలో తెలంగాణలో మూడు మెడికల్ కాలేజీలు మాత్రమే ఉంటే, ఇప్పుడు 17కు పెంచుకున్నామని… ఈ ఏడాది కొత్తగా మరో 8, వచ్చే ఏడాది మరో 8 మెడికల్ కాలేజీలు పెట్టుకున్నామని స్పష్టం చేశారు. దేశంలోనే అన్ని జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఉన్న రాష్ట్రంగా తెలంగాణ నిలువబోతున్నదని చెప్పారు హరీష్ రావు.