కేంద్రం కొత్త మార్గదర్శకాలు.. రిటైర్ అయ్యాక కూడా చీఫ్ జస్టిస్ లకు ప్రత్యేక సదుపాయాలు

-

కేంద్రం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. రిటైర్ అయ్యాక కూడా చీఫ్ జస్టిస్ లకు ప్రత్యేక సదుపాయాలు కల్పించనుంది. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి కి ఢిల్లీలో ఉచిత బంగ్లా, భద్రత, డ్రైవర్ ను ఏర్పాటు చేయనుంది. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తులకు, హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులకు కూడా ఈ సౌకర్యం వర్తింపు ఛేయనుంది కేంద్రం.

Indian Supreme Court

ఆ మేరకు నిబంధనలు మారుస్తూ కేంద్రం ఉత్తరువులు జారీ చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గా పదవీ విరమణ చేసిన తర్వాత 6 నెలలు ( టైపు-7) ఉచిత నివాసం ఉండనుంది. ఢిల్లీలో 6 నేలలు ఉచిత బంగ్లా తో పాటు, ఒక ఏడాది పాటు భద్రత, వ్యక్తిగత సిబ్బంది డ్రైవర్ సౌకర్యం కల్పించనుంది. ఈ సౌకర్యాలు సుప్రీం కోర్టు న్యాయమూర్తులకు, హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులకు కూడా వర్తింపజేస్తూ ఉత్తరువులు జారీ చేసింది. హైకోర్ట్ మాజీ ప్రధాన న్యాయమూర్తులకు, హైకోర్టు మాజీ న్యాయమూర్తులకు కూడా విమానాశ్రయాల్లో శాశ్వత ప్రాతిపదికన “ప్రోటోకాల్” కల్పిస్తూ ఉత్తరువులు జారీ చేసింది కేంద్రం.

Read more RELATED
Recommended to you

Exit mobile version