MIకి రోహిత్ గుడ్ బై.. RCBకి రాహుల్?.. 2025 IPLలో బిగ్ ఛేంజెస్ ఇవే!

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్‌కు మరో ఐదు నెలల్లో మెగా వేలం జరగనుంది. రానున్న సీజన్లో చాలా మంది స్టార్‌ ప్లేయర్లు టీమ్‌లు మారే అవకాశం ఉంది. కొన్ని ఫ్రాంచైజీలు రోహిత్‌, పంత్‌ వంటి స్టార్స్‌పై కన్నేశాయని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం వైరల్‌గా మారిన ప్రచారాలు, ఐపీఎల్‌ 2025 అప్‌డేట్స్‌ ఏంటంటే?

ముంబయి ఇండియన్స్‌ ప్లేయర్స్ రోహిత్ శర్మ, సూర్య కుమార్‌ యాదవ్‌ను 2025 వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ కొనే ప్లాన్‌లో ఉన్నట్లు సమాచారం. మరోవైపు బుమ్రా కూడా ఎంఐని వీడనున్నాడట. ముంబయి రోహిత్ శర్మను వదిలేస్తే హిట్మ్యాన్ గుజరాత్ టైటాన్స్ లేదా దిల్లీ క్యాపిటల్స్‌లో చేరే అవకాశం ఉందని సమాచారం.

2016లో దిల్లీ క్యాపిటల్స్‌ తరఫున అరంగేట్రం చేసిన రిషభ్ పంత్‌ను చెన్నై సూపర్ కింగ్స్‌ కొనుగోలు చేసే ప్లాన్‌లో ఉంది. లఖ్‌నవూ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ని ఆర్సీబీ కొనే ప్రయత్నాల్లో ఉందట. గుజరాత్ టైటాన్స్‌ను అదానీ గ్రూప్‌ దక్కించుకోనుందట. 2025 ఐపీఎల్లో దాదాపు నాలుగు ఫ్రాంచైజీల కెప్టెన్లు మారనున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. అందులో ఆర్సీబీ, దిల్లీ, లఖ్నవూ, పంజాబ్ జట్లు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version