క్యాండీ క్రష్ ఆడిన ధోనీ.. వీడియో వైరల్ అయిన 3 గంటల్లో 30 లక్షల డౌన్​లోడ్స్​

-

టీమ్ఇం డియా మాజీ కెప్టెన్​ ఎమ్ఎస్​ ధోనీ చేసిన ఓ పని క్యాండీ క్రష్ టీమ్​కు బాగా కలిసొచ్చింది. ధోనీ.. తన భార్య సాక్షితో కలిసి ఇటీవల ఇండిగో విమానంలో ప్రయాణిస్తుండగా.. ఓ ఎయిస్​ హోస్టెస్​ అతడికి చాక్లెట్లు, డ్రై ఫ్రూట్స్​తో కూడిన ఓ ట్రేను ఇచ్చింది. అందులో నుంచి కేవలం డ్రై ఫ్రూట్స్​ మాత్రమే తీసుకుని.. చాక్లెట్లను సున్నింతగా తిరస్కరించాడు.

ఈ వీడియో సోషల్​ మీడియాలో పోస్టు చేయగా.. కొద్ది సేపట్లోనే వైరల్​గా మారింది. ఈ వీడియోలో.. ధోనీ ట్యాబ్​లో క్యాండీ క్రష్​ గేమ్​ ఆడుతున్నట్లు అభిమానులు గమనించారు. అనంతరం ఆ వీడియో కింద కామెంట్ల జల్లు కురిపించారు.

ఈ విషయం వైరల్ అయిన 3 గంటల్లో 30 లక్షల మందికి పైగా క్యాండీ క్రష్​ యాప్​ డౌన్​లోడ్​ చేసుకోవడం విశేషం. ఈ మేరకు క్యాండీ క్రష్ టీమ్ ట్వీట్ చేసింది. తమను ట్రెండింగ్​లోకి తీసుకు వచ్చినందుకు ధోనీకి కృతజ్ఞతలు తెలిపింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version