బీసీసీఐ సెలక్టర్ గా అజిత్ అగార్కర్ ఎంపిక…

-

నిన్ననే నూతన బీసీసీఐ సీనియర్ మెన్ చీఫ్ సెలెక్టర్ గా మాజీ ఇండియా బౌలర్ అజిత్ అగార్కర్ ను బీసీసీఐ అనౌన్స్ చేసింది. ఇతన్ని క్రికెట్ అడ్వైజరీ కమిటీలో సభ్యులు అయిన సులక్షణ నాయక్, అశోక్ మల్హోత్రా మరియు జతిన్ పరాంజపే లు ఏకపక్షముగా హెడ్ సెలక్షన్ పనెల్ కు రికమెండ్ చేయడంతో, వీరి అభ్యర్థనను గౌరవించిన సెలక్షన్ పనెల్ అజిత్ అగార్కర్ ను కొత్త బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ గా నియమించింది. కాగా ఈ సంవత్సరం ఫిబ్రవరి లో బీసీసీఐ సెలెక్టర్ గా ఉన్న చేతన్ శర్మ తనకు తానుగా పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే అజిత్ అగార్కర్ కు గతంలో సీనియర్ ముంబై టీం సెలెక్టర్ గా చేసిన అనుభవం మరియు ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కి కోచింగ్ స్టాఫ్ గా చేసిన అనుభవం ఉంది.

 

ఇప్పుడు సెలెక్టర్ గా తన ఫస్ట్ జాబ్ వెస్ట్ ఇండీస్ తో ఇండియా ఆడనున్న టీ 20 లకు జట్టును ఎంపిక చేయడం. ఇప్పటికే శివ సుందర్ దాస్ టెస్ట్ లు మరియు వన్ డే లకు జట్టును ఎంపిక చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version