తొలుత టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్ బౌలింగ్ లో తన ప్రతిభ కనబరిచింది. ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 174 పరుగులు చేశారు. ప్రారంభంలో ఓపెనర్లు డేవిడ్ వార్నర్, మార్ష్ కాస్త దూకుడుగా ఆడినట్టు కనిపించినప్పటికీ భారీ స్కోరు మాత్రం సాధించలేకపోయారు. తొలుత మార్ష్ ఔట్ అయ్యాడు. అప్పటి నుంచి పటా పట్ వికెట్లు పడిపోయాయి. కెప్టెన్ రిషబ్ పంత్ 13 బంతుల్లో 18 పరుగులను సాదించాడు.
అక్షర్ పటేల్ రన్ కావడంతో ఢిల్లీ క్యాపిటల్స్ ఎక్కువ స్కోరు సాధించలేకపోయింది. హోప్ (33), వార్నర్ 29, మార్ష్ 20 పరుగులు సాధించారు. అక్షర్ పటేల్ చివర్లో కాస్త స్కోరు ని పరుగులు పట్టించే ప్రయత్నం చేశాడు. కానీ అనూహ్యంగా రన్ ఔట్ కావడం గమనార్హం. చివరి ఓవర్ లో హర్షల్ పటేల్ బౌలింగ్ లో పోరెల్ 4, 6, 4, 4,6,1 పరుగులు సాధించాడు. కేవలం 10 బంతుల్లో పోరెల్ 32 పరుగులు చేశాడు.