RCB అభిమానుల‌కు గుడ్ న్యూస్! రేపు ఉద‌యం 9 గంట‌ల‌కు ..

ఐపీఎల్ స్టార్ జ‌ట్టు రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూర్ జ‌ట్టు త‌న అభిమానుల‌కు శుభవార్త ను అందించాడానికి సిద్ధం అయింది. రేపు ఉద‌యం 9 గంట‌ల‌కు అంద‌రు రెడీ గా ఉండండి అంటూ త‌న ఇన్ స్టాగ్రామ్ ద్వారా త‌న అభిమానులు కు సూచించింది. అంద‌రూ కూడా రేపు ఉద‌యం 9 గంట‌ల‌కు నోటీఫికేష‌న్ పెట్టు కుని మ‌రి సిద్ధం గా ఉండాల‌ని త‌న అభిమానుల ను అల‌ర్ట్ చేసింది.

అయితే ఐపీఎల్ 2022 కు సంబంధించి రిటైన్ చేసుకోనే ఆట‌గాళ్ల పేర్ల ను ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంద‌ని ఆర్ సీ బీ అభిమానులు భావిస్తున్నారు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఆర్ సీ బీ డివిలియ‌ర్స్ ను రిటైన్ చేసుకుంటుంద‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ డివిలియ‌ర్స్ ఇటీవ‌ల అన్ని ఫార్మెట్ల కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు. దీంతో ఇవ‌రెవ‌రి ని ఆర్ సీ బీ రిటైన్ చేసుకుంటుందా.. అని అభిమానుల్లో టెన్ష‌న్\ మొద‌లైంది. కాగ వచ్చే నెల‌లో నే ఐపీఎల్ 2022 కు సంబంధించి మెగా యాక్ష‌న్ ఉండ‌బోతుంది.