ముంబై లోని డాక్టర్ డి. వై పాటిల్ ఆకాడమి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్, కోల్ కత్త నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. ఈ ఉత్కంఠ మ్యాచ్ లో కోల్‌కత్త నైట్ రైడర్స్ ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టు 3 వికెట్ల తేడాతో ఓడించింది. 129 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన రాలయ్ ఛాలెంజర్స్ బెంగళూర్ కు ఆదిలోనే ఎదురు దెబ్బలు తగిలియి. మొదటి మ్యాచ్ లో ఆఫ్ సెంచరీతో దుమ్ము లెపిన కెప్టెన్ డుప్లెసిస్ (5) తో వెనుతిరిగాడు.
మరో ఓపెనర్ అనుజ్ రావత్ (0) మరో సారి విఫలం అయ్యాడు. అలాగే విరాట్ కోహ్లి (12) కూడా త్వరగానే అవుట్ అయ్యాడు. అయితే తర్వాత వచ్చిన డేవిట్ విల్లీ ( 28 బంతుల్లో 18 ) తో పాటు షెర్ఫానే రూథర్‌ఫోర్డ్ (40 బంతుల్లో 28 ) స్లోగా ఆడుతూ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. బంతులు వెస్ట్ కావడంతో చివర్లో ఉత్కంఠగా మారింది. కానీ చివర్లో షాబాజ్ అహ్మద్ (27) వరుసగా 3 సిక్స్ లు కొట్టాడు.
అలాగే దినేశ్ కార్తిక్ (14 నాటౌట్ ) బ్యాక్ టూ బ్యాక్ బౌండరీలు బాదాడు. వీరికి తోడు హర్షల్ పటేల్ (10 నాటౌట్ ) కూడా చివర్లో రెండు ఫోర్లు కొట్టాడు. దీంతో ఉత్కంఠ గా ఈ మ్యాచ్ చివరికి బెంగళూర్ వశం అయింది. కాగ ఈ మ్యాచ్ లో బెంగళూర్ బౌలర్ 4 వికెట్లు తీసిన వనిందు హసరంగా కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.