వన్ డే వరల్డ్ కప్ 2023 లో ఆస్ట్రేలియా జట్టు ఇండియాను ఘోరంగా ఓడించి కప్ ను తన్నుకుపోయింది. టోర్నీ ఆద్యంతం అద్భుతమైన ప్రదర్శన చేసిన టీం ఇండియా ఫైనల్ లో తడబడి కప్ ను కోల్పోయింది. ఈ టోర్నమెంట్ లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా విరాట్ కోహ్లీ నిలవగా, అత్యధిక వికెట్లను పడగొట్టిన బౌలర్ గా మహమ్మద్ షమీ రికార్డును సాధించాడు. ఈ టోర్నమెంట్ లో విరాట్ కోహ్లీ సాధించిన ప్లేయర్ అఫ్ ది సిరీస్ తో కెరీర్ లోనే 21 సార్లు అవార్డు అందుకున్న ప్లేయర్ గా ఘనతను సాధించాడు. ఈ రికార్డును విరాట్ కోహ్లీ 157 సిరీస్ లలో ఆడడం ద్వారా సాధించడం విశేషం. ఇక కోహ్లీ తర్వాత స్థానంలో సచిన్ టెండూల్కర్ 20 సార్లు నెగ్గాడు.
వరల్డ్ కప్ కోల్పోయిన బాధలోనూ కొంచెమైనా సంతోషమంటే కోహ్లీ, మహమ్మద్ షమీ ల గర్వించదగిన ప్రదర్శన కారణం అని చెప్పాలి. ఇక ఈ టోర్నీ తర్వాత నవంబర్ 23 నుండి జరగనున్న సిరీస్ కు సీనియర్ ప్లేయర్స్ అందరూ విశ్రాంతి తీసుకోనున్నారు.