టూర్ ర‌ద్దు చేసుకోవ‌డంతో న్యూజిలాండ్‌పై పాక్ క్రికెట్ అభిమానుల ఆగ్ర‌హం.. ట్రోల్ చేస్తున్న పాక్ నెటిజ‌న్లు..

పాకిస్థాన్‌లో 18 ఏళ్ల త‌రువాత వ‌న్డే, టీ20 సిరీస్ ఆడేందుకు వ‌చ్చిన న్యూజిలాండ్ స్టేడియంకు రాకుండానే అటు నుంచి అటే ఇంటికి వెళ్లిపోయింది. బాంబు బెదిరింపులు వ‌చ్చిన నేపథ్యంలో భ‌ద్ర‌త‌కు ముప్పు ఉంద‌ని త‌మ దేశ అధికారులు సూచన ఇవ్వ‌డంతో న్యూజిలాండ్ క్రికెట‌ర్లు పాక్ టూర్‌ను ర‌ద్దు చేసుకుని వెన‌క్కి వెళ్లిపోయారు. అయితే దీనిపై పాకిస్థాన్ క్రికెట్ అభిమానులు మండిప‌డుతున్నారు.

pak cricket fans troll newzealand for abandoning tour

పాకిస్థాన్ టూర్ లో భాగంగా న్యూజిలాండ్ 3 వ‌న్డేలు, 5 టీ20లు ఆడాల్సి ఉంది. శుక్ర‌వారం మొద‌టి వ‌న్డే జ‌ర‌గాల్సి ఉంది. కానీ భ‌ద్ర‌తా ప‌ర‌మైన కార‌ణాల‌తో ఏకంగా టూర్ మొత్తం ర‌ద్దు అయింది. అయితే న్యూజిలాండ్ ప్లేయ‌ర్లు అన‌వ‌స‌రంగా భ‌య‌ప‌డి టూర్‌ను ర‌ద్దు చేసుకున్నార‌ని ఆరోపిస్తూ పాక్ అభిమానులు న్యూజిలాండ్‌ను ట్రోల్ చేస్తున్నారు.

2019 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో ఫైన‌ల్‌లో ఇంగ్లండ్ చేతిలో న్యూజిలాండ్ ఓట‌మి పాల‌వ్వ‌గా.. ఆ మ్యాచ్‌కు చెందిన ఫొటోల‌ను పాక్ అభిమానులు షేర్ చేస్తున్నారు. త‌మ‌కు ఈ విధంగానైనా ఇంగ్లండ్ సంతృప్తిని ఇచ్చింద‌ని, అందుకు ఇంగ్లండ్‌కు థ్యాంక్స్ అని అభిమానులు న్యూజిలాండ్‌ను ట్రోల్ చేస్తున్నారు.

అయితే పాక్ సెక్యూరిటీ అధికారులు మ్యాచ్ జ‌ర‌గాల్సి ఉన్న రావ‌ల్పిండి మైదానంలో బాంబ్ స్క్వాడ్‌తో త‌నిఖీలు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. సెక్యూరిటీ పూర్తి స్థాయిలో ఉంద‌ని చెప్పిన త‌రువాత మ‌ళ్లీ బాంబు స్క్వాడ్ తో త‌నిఖీలు చేయించ‌డం ఎందుక‌ని ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు. పాక్‌లో భ‌ద్ర‌త అంత‌లా ఉంటే న్యూజిలాండ్ క్రికెటర్లు ఎందుకు వెళ్లిపోతార‌ని, క‌చ్చితంగా అక్క‌డ భ‌ద్రత ఉండ‌ద‌ని ప‌లువురు కామెంట్లు చేస్తున్నారు.