కటక్ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య రెండో వన్డే మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్. దీంతో టీమిండియా మరోసారి మొదట బౌలింగ్ చేయనుంది. అటు వన్డేల్లోకి వరుణ్ చక్రవర్తి అరంగేట్రం చేస్తున్నాడు.. యశస్వి జైస్వాల్ స్థానంలో జట్టులోకి వచ్చిన విరాట్ కోహ్లీ.. మొదటి వికెట్ కు బ్యాటింగ్ చేయనున్నాడు. మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ హాట్ స్టార్ లో ప్రారంభం కానుంది.
భారత్ vs ఇంగ్లండ్ 2వ ODI ప్లేయింగ్ XIలు
భారత్: రోహిత్ శర్మ(సి), శుభమన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(w), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మహమ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి
ఇంగ్లాండ్: ఫిలిప్ సాల్ట్(w), బెన్ డకెట్, జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(c), లియామ్ లివింగ్‌స్టోన్, జామీ ఓవర్టన్, గుస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్, సాకిబ్ మహమూద్