త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న క్రికెట్ ప్ర‌పంచ‌క‌ప్ విజేత‌కు ఎంత ప్రైజ్ మ‌నీ ఇవ్వ‌నున్నారో తెలుసా..?

-

feaఈసారి వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో భార‌త్‌తోపాటు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జ‌ట్లు ఫేవరెట్లుగా బరిలోకి దిగుతుండ‌డంతోపాటు అటు సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌, వెస్టిండీస్ జ‌ట్లు కూడా గ‌ట్టిపోటీనిచ్చేందుకు సిద్ధ‌మ‌వుతున్నాయి. దీంతో ఈసారి వ‌ర‌ల్డ్ క‌ప్‌లో ఆస‌క్తిక‌ర పోరు ఖాయంగా క‌నిపిస్తోంది.

ప్ర‌పంచంలోని క్రికెట్ అభిమానులంతా త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న విష‌యం విదిత‌మే. ఈ నెల 30వ తేదీ నుంచి ఇంగ్లండ్‌లో వ‌ర‌ల్డ్ క‌ప్ ప్రారంభం కానుంది. దీంతో ఆయా జ‌ట్ల‌కు చెందిన అభిమానుల మ‌ధ్య ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో పోస్టుల యుద్ధం కూడా మొద‌లైంది. త‌మ జ‌ట్టు గెలుస్తుందంటే.. త‌మ జ‌ట్టు తెలుస్తుంద‌ని అభిమానులు సోష‌ల్ మీడియాలో పోట్లాడుకుంటున్నారు. ఈ క్ర‌మంలో అటు ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా.. ఇటు భార‌త్‌, పాకిస్థాన్ జ‌ట్ల‌కు చెందిన అభిమానుల మ‌ధ్య ఇప్పుడు కోల్డ్ వార్ న‌డుస్తోంది.

ఇక ఈసారి వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో భార‌త్‌తోపాటు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జ‌ట్లు ఫేవరెట్లుగా బరిలోకి దిగుతుండ‌డంతోపాటు అటు సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌, వెస్టిండీస్ జ‌ట్లు కూడా గ‌ట్టిపోటీనిచ్చేందుకు సిద్ధ‌మ‌వుతున్నాయి. దీంతో ఈసారి వ‌ర‌ల్డ్ క‌ప్‌లో ఆస‌క్తిక‌ర పోరు ఖాయంగా క‌నిపిస్తోంది. అయితే ఈసారి వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచే జ‌ట్టుకు న‌జరానా ఎంత ఇవ్వ‌నున్నారో ఆ వివ‌రాల‌ను కూడా ఐసీసీ ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది. దాని ప్ర‌కారం… క్రికెట్ ప్రపంచ కప్ గెలిచిన జట్టుకు 4 మిలియ‌న్ డాల‌ర్ల బ‌హుమ‌తి ద‌క్కుతుంది. అంటే భార‌తీయ క‌రెన్సీలో దాదాపుగా రూ.28 కోట్ల‌కు పైగానే ఉంటుంది.

ఇక వ‌ర‌ల్డ్ క‌ప్‌లో ర‌న్న‌ర‌ప్ గా నిలిచిన జట్టుకు 2 మిలియ‌న్ డాల‌ర్లు ద‌క్కుతాయి. అలాగే సెమీ ఫైన‌ల్ చేరి ఓడిపోయే జ‌ట్ల‌కు 8 ల‌క్ష‌ల డాల‌ర్లు, లీగ్ ద‌శ‌లో ఒక్కో మ్యాచ్ గెలిచిన ప్ర‌తిసారీ ఒక్కో జ‌ట్టుకు 40వేల డాల‌ర్లు ద‌క్కుతాయి. ఇక లీగ్ ద‌శ నుంచే ఇంటికెళ్లే జ‌ట్ల‌కు ఒక్కో జ‌ట్టుకు ల‌క్ష డాల‌ర్లు ద‌క్కుతాయి. అలాగే ప్ర‌పంచ క‌ప్ లో పాల్గొనే జ‌ట్ల‌కు అన్నింటికీ క‌లిపి 10 మిలియ‌న్ డాల‌ర్ల ప్రైజ్ మ‌నీని ఐసీసీ అందివ్వ‌నుంది. కాగా మే 30వ తేదీ నుంచి ప్రారంభం అయ్యే క్రికెట్ వ‌ర‌ల్డ్ క‌ప్ 2019 46 రోజ‌లు పాటు కొన‌సాగ‌నుంది. జూలై 14వ తేదీన ఇంగ్లండ్‌లోని లార్డ్స్ మైదానంలో ఫైన‌ల్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఇక చివ‌రిసారిగా 1999లో ఇంగ్లండ్‌లో ప్ర‌పంచ క‌ప్ నిర్వ‌హించారు. 20 ఏళ్ల త‌రువాత మ‌ళ్లీ ఈసారి క్రికెట్‌ ప్ర‌పంచ కప్‌కు ఇంగ్లండ్ వేదిక కానుంది. మ‌రి ఈ సారి ప్ర‌పంచ‌క‌ప్‌ను ఎవ‌రు పైకి ఎత్తుతారో చూడాలి..!

Read more RELATED
Recommended to you

Latest news