ఆర్‌సీబీపై గుజరాత్‌ టైటాన్స్‌ ఘన విజయం

-

నేడు ఐపీఎల్‌లో రసవత్తర పోరు జరుగుతోంది. బ్రబౌర్న్‌ స్టేడియం వేదికగా గుజరాత్‌ టైటాన్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్లు పోటీ పడుతున్నాయి. అయితే ఈ మ్యాచ్‌లోటాస్‌ గెలిచిన బెంగళూరు బ్యాటింగ్‌ ఎంచుకుంది. 11 పరుగులు వద్ద ఆర్‌సీబీ తొలి వికెట్‌ చేజార్చుకుంది. అయితే విరాట్ కోహ్లి 53 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌ తో 58 పరుగులు చేయగా, ర‌జ‌త్ ప‌టిదార్ 32 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 52 పరుగుల చేసి అర్ధ సెంచ‌రీల‌తో రాణించాడు. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో బెంగళూరు జ‌ట్టు 6 వికెట్ల న‌ష్టానికి 170 ప‌రుగులు చేసింది. 19వ ఓవ‌ర్లో మ్యాక్స్‌వెల్ (18 బంతుల్లో 33; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు)ను ఫెర్గుస‌న్ పెవిలియ‌న్‌కు పంపించ‌డంతో ఆర్సీబీ భారీ స్కోర్ ఆశ‌లకు గండిప‌డింది.

Gujarat Titans are going to be difficult to stop in IPL 2022: Kevin Pietersen - Sports News

ఆఖ‌రి ఓవ‌ర్లో లోమ్రార్ ఓ సిక్స‌ర్, ఫోర్ స‌హా 15 ప‌రుగులు రాబ‌ట్ట‌డంతో ఆర్సీబీ ఈ మాత్రం స్కోరైనా సాధించ‌గ‌లిగింది. గుజ‌రాత్ బౌల‌ర్ల‌లో ప్ర‌దీప్ సాంగ్వాన్ 2 , ష‌మీ, జోస‌ఫ్‌, ఫెర్గుస‌న్‌, ర‌షీద్ ఖాన్ లు త‌లో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. 171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్‌ టైటాన్స్‌ 19.3 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. రాహుల్‌ తెవాటియా 43, డేవిడ్‌ మిల్లర్‌ 39 పరుగులు చేసి జట్టును గెలిపించారు. అంతకముందు గిల్‌ 31 పరుగులు చేశాడు. ఆర్‌సీబీ బౌలర్లలో షాబాజ్‌ అహ్మద్‌, హసరంగా చెరో రెండు వికెట్లు తీశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news